E-Paper
Advertisement

హైదరాబాద్ నుంచి అండమాన్ IRCTC ఫ్లైట్ టూర్.. ధర కూడా తక్కువేనండోయ్!

హైదరాబాద్ నుంచి అండమాన్ IRCTC ఫ్లైట్ టూర్.. ధర కూడా తక్కువేనండోయ్!
Advertisement

IRCTC Andaman Tour 2026: అండమాన్ అందాలను చూడాలని ప్లాన్ చేస్తున్న వారికి ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి విమానంలో అండమాన్ వెళ్లి అక్కడి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చేలా ఈ టూర్‌ను రూపొందించారు. ‘అమేజింగ్ అండమాన్ విత్ బరాటాంగ్’ పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చారు. ఈ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్, హ్యావ్‌లాక్, నీల్ ఐలాండ్, బరాటాంగ్ లాంటి ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. మొత్తం 6 రాత్రులు, 7 రోజుల పాటు టూర్ కొనసాగుతుంది.

మూడు తేదీల్లో టూర్ ప్రారంభం!

ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 26, అక్టోబర్ 12, నవంబర్ 19, 2026 తేదీల్లో ప్రారంభమవుతుంది. మొత్తం 29 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ.65,200 నుంచి మొదలవుతుంది. సెప్టెంబర్ 26 టూర్‌లో హైదరాబాద్ నుంచి ఉదయం 7:05 గంటలకు విమానం బయలుదేరి చెన్నై మీదుగా మధ్యాహ్నం 1 గంటకు శ్రీ విజయ పురం (పోర్ట్ బ్లెయిర్) చేరుకుంటుంది. అక్టోబర్, నవంబర్ టూర్లలో ఉదయం 6:35 గంటలకు విమానం బయలుదేరి 9:05 గంటలకు పోర్ట్ బ్లెయిర్ చేరుతుంది.

మొదటి రోజే సెల్యులార్ జైలు సందర్శన!

Advertisement

పోర్ట్ బ్లెయిర్ చేరుకున్న తర్వాత హోటల్‌కు తీసుకెళ్తారు. అనంతరం ఫ్లాగ్ పాయింట్, సెల్యులార్ జైలు మ్యూజియాన్ని సందర్శిస్తారు. అక్కడ లైట్ అండ్ సౌండ్ షో కూడా ఉంటుంది. రాత్రి పోర్ట్ బ్లెయిర్‌లోనే బస చేస్తారు. రెండో రోజు క్రూయిజ్‌లో హ్యావ్‌ లాక్‌ కు వెళ్తారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ చేసిన తర్వాత ప్రసిద్ధ రాధానగర్ బీచ్‌కు తీసుకెళ్తారు. మూడో రోజు ఎలిఫెంట్ బీచ్ సందర్శన ఉంటుంది. అక్కడ వాటర్ స్పోర్ట్స్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, వాటికి అయ్యే ఖర్చును ప్రయాణికులే చెల్లించాలి.

నీల్ ఐలాండ్, బరాటాంగ్ కూడా..

నాలుగో రోజు కాలా పతర్ బీచ్ చూసిన తర్వాత క్రూయిజ్‌లో నీల్ ఐలాండ్‌కు వెళ్తారు. అక్కడ సీతాపూర్, లక్ష్మణ్‌పూర్ బీచ్‌లను సందర్శించడంతో పాటు సన్ సెట్ ను చూసే అవకాశం ఉంటుంది. ఐదో రోజు భారత్‌నగర్ బీచ్ సందర్శించి తిరిగి పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. ఆరో రోజు బరాటాంగ్ డే ట్రిప్ ఉంటుంది. ఉదయం బయలుదేరి అక్కడి ప్రాంతాలను చూసిన తర్వాత సాయంత్రం పోర్ట్ బ్లెయిర్‌కు తిరిగి వస్తారు. ఏడో రోజు ఉదయం హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం విమానంలో హైదరాబాద్ తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

ప్యాకేజీ ధర ఎంత?

Advertisement

కంఫర్ట్ క్లాస్‌ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.87,700, డబుల్ ఆక్యుపెన్సీకి ఒక్కొక్కరికి రూ.67,300, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.65,200 చెల్లించాలి. 2 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్‌ తో రూ.57,450, బెడ్ లేకుండా రూ.53,350 ధరగా ఉంది. రెండేళ్లలోపు చిన్నారులకు ఒకవైపు విమాన ప్రయాణానికి సుమారు రూ.1,750 అదనంగా ఉంటుంది. బుకింగ్, పూర్తి వివరాల కోసం IRCTC టూరిజం వెబ్‌ సైట్‌ ను చూడాలి. సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలోని IRCTC కార్యాలయాల ఫోన్ నంబర్ల ద్వారా కూడా సమాచారం పొందవచ్చు.

Read Also: జస్ట్ రూ. 95 వేలకే బాలి ట్రిప్.. హైదరాబాద్ నుంచి IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ!

Tags

Related News

బడ్జెట్‌ లో ఊటీ ట్రిప్.. హైదరాబాద్ నుంచి IRCTC 6 రోజుల టూర్ ప్యాకేజీ!

జస్ట్ రూ. 95 వేలకే బాలి ట్రిప్.. హైదరాబాద్ నుంచి IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ!

సింగిల్ కమాండ్ తో టికెట్ బుక్ చేసిన ఏఐ.. ఇక IRCTCలో లాగిన్ అవసరం లేదా?

తక్కువ ధరలో IRCTC కాశ్మీర్ టూర్.. ఫ్లైట్, హోటల్, ఫుడ్ అన్నీ అందులోనే!

తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? సీటు కన్ఫర్మ్ కావాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. ఊడిన విమానం టైరు, ప్రయాణికులు అరుపులు, కేకలు

వావ్ అన్న వావ్.. ఇది బోగాపురం ఎయిర్‌పోర్ట్ కాదు, వినాయక మండపం!

Big Stories

Advertisement
×