E-Paper
Advertisement

10 ఏళ్ల తర్వాత పెళ్లి పీటలెక్కిన నటి అహానా కృష్ణ.. వరుడు ఎవరంటే?

10 ఏళ్ల తర్వాత పెళ్లి పీటలెక్కిన నటి అహానా కృష్ణ.. వరుడు ఎవరంటే?
Advertisement

Actress Ahaana Krishna: ఈ ఏడాది సెలబ్రిటీలు చాలామంది ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఎన్నో ఏళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతూ వైవాహిక బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న (Rashmika mandanna)- విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), అల్లు శిరీష్ (Allu Sirish) లాంటి ఎంతోమంది సెలబ్రిటీలు వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. మరొకవైపు కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram), కాలభైరవ(Kala Bhairava) కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు . ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక నటి దాదాపు 10 ఏళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతూ.. వైవాహిక బంధం లోకి అడుగు పెట్టింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ మలయాళ నటి అహానా కృష్ణ (Ahaana Krishna ( .

పెళ్లి పీటలెక్కిన ప్రముఖ నటి..

మలయాళ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. 2014లో ‘నేన్ స్టీవ్ లోపెజ్’ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత లూకా, నిండుకలుడే నాటిల్ ఒరిడవేళ వంటి చిత్రాలలో నటించిన ఈమె.. సినిమాలలో నటిస్తున్నప్పుడే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి (Nimish Ravi) తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి అది కాస్త ప్రేమగా మారింది. సెప్టెంబర్ 13న కేరళలోని రాజ్ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు రిషబ్ శెట్టి, ఆయన భార్య ప్రజ్ఞ శెట్టి తో పాటు దుల్కNIMISH RAVIర్ సల్మాన్ అలాగే పలువురు సినీ ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది.

స్వయంగా ప్రకటించిన అహానా కృష్ణ..

Advertisement

తనకు పెళ్లి జరిగింది అనే విషయాన్ని ఈమె స్వయంగా సెప్టెంబర్ 15న తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించడంతో అభిమానులకు అసలు విషయం తెలిసింది. తాజాగా అహానా కృష్ణ.. నిమిష్ రవితో పెళ్లి చేసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ..” మేమిద్దరం 20 ఏళ్ల వయసులో కలుసుకున్నాము. ఇప్పుడు నాకు 30 ఏళ్ల వయసులో పెళ్లి జరుగుతోంది” అంటూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిమిష్ రవి తన బెస్ట్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, పార్టనర్, సోల్మెట్ అంటూ పేర్కొన్న ఈమె జీవితాంతం కలిసి ఒక ప్రపంచాన్ని నిర్మించుకోవాలని కోరుకుంటున్నట్లు ఎమోషనల్ గా కూడా రాసుకుంది. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ALSO READ: చిన్నారి మృతి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటి పూర్ణ!

నిమిష్ రవి బ్యాక్ గ్రౌండ్..

Advertisement

చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన విజువల్స్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినిమాటోగ్రాఫర్ పేరు పొందిన నిమిష్ రవి… అహానా నటించిన లూకా సినిమాతోనే నిమిషా రవి సినిమాటోగ్రాఫర్ గా తన కెరియర్ను మొదలుపెట్టారు. ఆ తర్వాత కింగ్ ఆఫ్ కోత , లక్కీ భాస్కర్, కురుప్ వంటి చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇక అలాంటి ఈయనతో ఇప్పుడు ఈమె ఏడడుగులు వేసింది.ఈ నూతన జంటకు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related News

చిన్నారి మృతి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటి పూర్ణ!

Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. ఇది అస్సలు ఊహించలేదు మావా..!

సాయి పల్లవి కోసం.. ‘రామాయణ్’ సాంగ్‌లో ఆ నటిని బ్లర్ చేశారా?

ఫాహ్.. ఈ ఫన్నీ సౌండ్‌కు స్ఫూర్తి కమెడియన్ వేణు మాధవ్?

ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక..ఆమె ఫస్ట్ రియాక్షన్ ఇదే!

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన కియారా సిద్దార్థ్ మల్హోత్రా!

పూర్తి అబ్బాయిగా మారిన స్నిగ్ధ.. గర్ల్ ఫ్రెండ్ కూడా?

Big Stories

Advertisement
×