E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేసాయ్..షాపింగ్‌కు రెడీ అయిపోండి!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేసాయ్..షాపింగ్‌కు రెడీ అయిపోండి!
Advertisement

Flipkart Big Billion Days 2026 dates: దేశ వ్యాప్తంగా షాపింగ్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అతిపెద్ద పండగ సీజన్ సేల్‌ వచ్చేస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్ నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026’ తేదీలు తాజాగా వెల్లడయ్యాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ గార్జెట్స్‌పై ఊహించని రీతిలో భారీ డిస్కౌంట్లు అందించే ఈ సేల్ కోసం యూజర్లు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సేల్ ఎప్పుడు మొదలవుతుంది ? ప్లస్ మెంబర్లకు ఎర్లీ యాక్సెస్ ఎప్పుడు లభిస్తుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ-కామర్స్ రంగంలో అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఫ్లిప్‌ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (Flipkart Big Billion Days). ప్రతీ ఏటా పండగ సీజన్‌కు ముందు ప్రారంభమయ్యే ఈ సేల్ కోసం కోట్లాది మంది కస్టమర్లు ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా కొత్త స్మార్ట్‌ ఫోన్‌లు, ల్యాప్‌ టాప్‌లు, టీవీలు, హోం అప్లయన్సెస్ తక్కువ ధరలకు కొనడానికి ఇదే సరైన సమయం. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ ఏడాదికి సంబంధించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీలు.. లీకై ట్రెండ్‌లో నిలిచాయి.

Advertisement

సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ప్రస్తుతం వస్తున్న అప్‌ డేట్స్ ప్రకారం.. ఫ్లిప్‌ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ నెలలో అందరికీ అందుబాటు లోకి రానుంది. అయితే.. సాధారణ యూజర్ల గంటే ముందే షాపింగ్ చేయాలనుకునే.. వారి కోసం కంపెనీ ఎర్లీ యాక్సెస్ అవకాశాన్ని కల్పిస్తోంది. ఫ్లిప్‌ కార్ట్ ప్లస్, వీఐపీ, బ్లాక్ మెంబర్లకు సాధారణ కస్టమర్ల కంటే.. సరిగ్గా ముందు గానే ఈ సేల్ ముందస్తుగా లభించనుంది. అంటే.. వీరు నచ్చిన వస్తువులను కార్ట్‌లో వేసుకొని ముందుగానే ఆర్డర్ చేసేయొచ్చు.

Advertisement

Also Read: మీ డేటా సేఫ్‌గా ఉండాలా? ChatGPTలో ఈ ఒక్కటి ఆఫ్ చేయండి చాలు!

భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు:

ఈ ఏడాది సేల్‌లో ప్రముఖ బ్రాండ్లపై భారీ తగ్గింపు ఉండనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్‌లు , శాంసంగ్, రియల్‌మీ, పోకో వంటి పాపులర్ మొబైల్స్‌పై ఊహించని ఆఫర్లు లభించనున్నాయి. కేవలం ప్రొడక్ట్ ధరలే కాకుండా.. అదనపు తగ్గింపుల కోసం ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ప్రముఖ క్రెడిట్ , డెబిట్ కార్డులపై, ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి షాపింగ్ చేసే వారికి.. సుమారు 10 శాతం వరకు ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.

జాగ్రత్తలు:

బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో కొన్ని పాపులర్ ప్రొడక్ట్స్ క్షణాల్లో అమ్ముడు పోతుంటాయి . కాబట్టి మీరు కొనాలనుకుంటున్న వస్తువులను ఇప్పట్నుంచే మీ విష్‌లిస్ట్‌లో యాడ్ చేసి పెట్టుకోవడం చాలా ముఖ్యం. అలాగే సేల్ ప్రారంభమైన వెంటనే ఎర్లీ యాక్సెస్ ఉన్న వారు ముందుగా ట్రై చేస్తే బెస్ట్ డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సరిగ్గా ఉపయోగించుకుంటే వేల రూపాయల ఆదా చేసుకోవచ్చు.

Related News

మీ డేటా సేఫ్‌గా ఉండాలా? ChatGPTలో ఈ ఒక్కటి ఆఫ్ చేయండి చాలు!

రూ.54,999 ఫోన్ ఇప్పుడు ఇంత తక్కువకా? Vivo Y51 Pro 5Gపై క్రేజీ ఆఫర్!

iPhone 17 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,000 వరకు ఆదా చేసుకునే ఛాన్స్!

QR స్కాన్ అవసరం లేదు.. ట్యాప్ చేస్తే చాలు, UPIలో కొత్త పేమెంట్ ఫీచర్!

వాట్సప్ నెంబర్ మార్చేటప్పుడు ఈ ఒక్క తప్పు చేస్తే.. మీ పాత చాట్స్ అన్నీ గోవిందా!

స్లిమ్ లుక్‌తో అదరగొడుతున్న Samsung Galaxy S26 FE.. భారత్‌లో దీని ధరెంతంటే?

రూ.9,000 డిస్కౌంట్‌తో శాంసంగ్ గెలాక్సీ A56 5G.. ఇంతకంటే బెస్ట్ ఆఫర్ మళ్లీ రాదు!

Big Stories

Advertisement
×