E-Paper
Advertisement

QR స్కాన్ అవసరం లేదు.. ట్యాప్ చేస్తే చాలు, UPIలో కొత్త పేమెంట్ ఫీచర్!

QR స్కాన్ అవసరం లేదు.. ట్యాప్ చేస్తే చాలు, UPIలో కొత్త పేమెంట్ ఫీచర్!
Advertisement

UPI Payments: సాధారణంగా ఏదైనా షాపులో బిల్ కట్టేటప్పుడు ఫోన్ తీసి యాప్ ఓపెన్ చేయడం, QR కోడ్ కోసం కెమెరా పెట్టడం.. ఇవన్నీ మనకు రోజూ అలవాటైపోయాయి. కానీ ఇకపై UPI పేమెంట్ చేయడానికి ఇన్ని స్టెప్స్ అవసరం లేకపోవచ్చు. ఫోన్‌ను ఒక్కసారి ట్యాప్ చేస్తే చాలు.. పేమెంట్ పూర్తయ్యేలా UPI Tap and Pay కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చింది. NFC సపోర్ట్ ఉన్న ఫోన్, అనుకూలమైన పేమెంట్ టెర్మినల్ ఉంటే ఈ ఫీచర్‌తో పేమెంట్లు మరింత ఫాస్ట్‌గా చేయొచ్చు.

స్కాన్ అవసరం లేదు..

Tap and Payలో ముందుగా యూపీఐ యాప్ తెరిచి కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫోన్‌ను అన్‌లాక్ చేసి, సపోర్ట్ చేసే పేమెంట్ టెర్మినల్ దగ్గరగా తీసుకెళ్తే సరిపోతుంది. ముఖ్యంగా రద్దీగా ఉండే షాపులు, కౌంటర్ల దగ్గర ఈ విధానం సమయం ఆదా చేయొచ్చు. అయితే ఫోన్‌తో పాటు పేమెంట్ టెర్మినల్ కూడా ఎన్‌ఎఫ్‌సీకి సపోర్ట్ చేయాలి.

Advertisement

Also Read: రోజూ 2GB డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ ఫ్రీ.. Jio కొత్త రీఛార్జ్ ప్లాన్ చూశారా?

రూ.5,000 వరకు..

ట్యాప్ అండ్ పేలో అర్హత ఉన్న రూ.5,000 వరకు చెల్లింపులకు యూపీఐ పిన్ అవసరం లేకుండా పేమెంట్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ మొత్తానికి మాత్రం సాధారణంగా యూపీఐ పిన్‌తో అదనపు వెరిఫికేషన్ ఉంటుంది. సపోర్ట్ ఉన్న చోట్ల రూపే క్రెడిట్ కార్డ్‌ను యూపీఐతో ఉపయోగించే అవకాశం కూడా ఉంటుంది. దీంతో చిన్న మొత్తాల చెల్లింపులు మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.

నెట్ లేకపోయినా..

Advertisement

మొబైల్‌లో ఇంటర్నెట్ సిగ్నల్ బలహీనంగా ఉన్నా, కొన్ని సందర్భాల్లో టెర్మినల్ కనెక్టివిటీ ఉపయోగపడేలా ఈ ఫీచర్ రూపొందించారు. భూగర్భ ప్రాంతాలు లేదా నెట్‌వర్క్ సరిగా రాని చోట్ల ఇది ఉపయోగకరంగా ఉండొచ్చు. అయితే ప్రతి చోటా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అనుకోవద్దు. ఫోన్, ఖాతా, టెర్మినల్ అన్నీ సపోర్ట్ చేయడం తప్పనిసరి.

My UPI ఏంటి?

ట్యాప్ అండ్ పేతో పాటు ఎన్‌పీసీఐ My UPI అనే యూనిఫైడ్ మేనేజ్‌మెంట్ విండోను కూడా తీసుకొచ్చింది. ఒకటి కంటే ఎక్కువ యూపీఐ యాప్‌లు వాడే వారికి ఇది ఉపయోగపడొచ్చు. ట్రాన్సాక్షన్ వివరాలు చూడటం, పేమెంట్ మాండేట్లు నిర్వహించడం వంటి పనులను ఒకే చోట చేయొచ్చు. అనుమానాస్పద డెబిట్ కనిపిస్తే త్వరగా స్పందించేందుకు సేఫ్టీ స్విచ్ వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. యూపీఐ సేవలకు సంబంధించిన సమాచారం కనుక్కోవడంలో ఏఐ ఆధారిత సహాయం కూడా అందించాలనేది దీని లక్ష్యం.

Also Read: యూపీఐ పేమెంట్స్ రూ.2,000 దాటితే ఛార్జీలా? కేంద్రం నుంచి వచ్చిన ఆఫీషియల్ అప్డేట్ ఇదే!

Tags

Related News

iPhone 17 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,000 వరకు ఆదా చేసుకునే ఛాన్స్!

వాట్సప్ నెంబర్ మార్చేటప్పుడు ఈ ఒక్క తప్పు చేస్తే.. మీ పాత చాట్స్ అన్నీ గోవిందా!

స్లిమ్ లుక్‌తో అదరగొడుతున్న Samsung Galaxy S26 FE.. భారత్‌లో దీని ధరెంతంటే?

రూ.9,000 డిస్కౌంట్‌తో శాంసంగ్ గెలాక్సీ A56 5G.. ఇంతకంటే బెస్ట్ ఆఫర్ మళ్లీ రాదు!

బరువు తగ్గడం ఇక ఈజీ.. ఒప్పో నుంచి అధునాతన ‘ఫ్యాట్ బర్నింగ్ వాచ్’ వచ్చేస్తోంది!

యాపిల్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. iPhone 18 Pro చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. ఐఫోన్ ధరలు తగ్గుతాయా? లేక షాక్ ఇస్తాయా? పూర్తి విశ్లేషణ!

Big Stories

Advertisement
×