E-Paper
Advertisement

రూ.54,999 ఫోన్ ఇప్పుడు ఇంత తక్కువకా? Vivo Y51 Pro 5Gపై క్రేజీ ఆఫర్!

రూ.54,999 ఫోన్ ఇప్పుడు ఇంత తక్కువకా? Vivo Y51 Pro 5Gపై క్రేజీ ఆఫర్!
Advertisement

Vivo Y51 Pro 5G: మనకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ సగం ధరకంటే తక్కువకే దొరికితే ఎవరికైనా ఆనందమే కదా. ఇప్పుడు అలాంటి అదిరిపోయే డీల్‌నే ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చింది. మంచి ఫీచర్లు, ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న Vivo Y51 Pro 5Gపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. సాధారణంగా ఈ ఫోన్ కొనాలంటే రూ.50 వేలకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏకంగా రూ.22,000 వరకు తగ్గింపు లభిస్తుండటంతో ఈ డీల్‌పై మొబైల్ ప్రియుల దృష్టి పడింది. మరి ఈ ధరకు Vivo Y51 Pro 5Gలో ఏం ఉంది? అసలు ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ వచ్చింది? బ్యాంక్ ఆఫర్‌తో ధర ఇంకా తగ్గుతుందా? ఇప్పుడా వివరాలన్నీ తెలుసుకుందాం.

ధర ఎంత తగ్గిందంటే?

మార్కెట్లో ఈ Vivo Y51 Pro 5G అసలు ధర రూ.54,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ సేల్‌లో భాగంగా దీనిని కేవలం రూ.32,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే.. ఏకంగా రూ.22,000 ఆదా అవుతుందన్నమాట. దీనికి తోడు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే మరో రూ.1,650 డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అప్పుడు దీని అసలు ధర రూ.31,349కి పడిపోతుంది. ఒకవేళ ఒకేసారి అంత డబ్బు పెట్టలేమనుకుంటే.. నెలకు రూ.2,750 చొప్పున 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Advertisement

Also Read: iPhone 17 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,000 వరకు ఆదా చేసుకునే ఛాన్స్!

బ్యాటరీ అదుర్స్ బాస్!

Vivo Y51 Pro 5G ఫోన్‌లో 7200mah బ్యాటరీ ఇచ్చారు. దీంతో రోజంతా ఎంత వాడినా సరే ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షనే ఉండదు. దీనికి తోడు 44 వాట్ల ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్ కూడా ఉండటంతో చాలా త్వరగానే ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇక నీళ్లు పడ్డా, దుమ్ము పడినా పాడైపోతుందనే భయం లేకుండా ఐపీ68, ఐపీ69 రేటింగ్‌తో దీన్ని తయారు చేశారు.

డిస్‌ప్లే, ప్రాసెసర్ ఎలా ఉన్నాయంటే?

Advertisement

ఫోన్ చూడటానికి ఎంత గ్రాండ్‌గా ఉందో.. లోపలి పనితీరు కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంది. Vivo Y51 Pro 5Gలో 6.75 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. దీంతో వీడియోలు చూసేటప్పుడు, గేమ్‌లు ఆడేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. అలాగే మంచి స్పీడ్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌ను అమర్చారు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 6 పై రన్ అవుతుంది.

కెమెరా విషయానికొస్తే..

ఫొటోలు ఇష్టపడేవాళ్ల కోసం వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. నార్మల్ ఫొటోగ్రాఫీకి ఈ కెమెరా సెటప్ చాలా బాగా పనిచేస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ లైఫ్, సూపర్ ఫీచర్లు ఉన్న ఫోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

Also Read: QR స్కాన్ అవసరం లేదు.. ట్యాప్ చేస్తే చాలు, UPIలో కొత్త పేమెంట్ ఫీచర్!

Tags

Related News

iPhone 17 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,000 వరకు ఆదా చేసుకునే ఛాన్స్!

QR స్కాన్ అవసరం లేదు.. ట్యాప్ చేస్తే చాలు, UPIలో కొత్త పేమెంట్ ఫీచర్!

వాట్సప్ నెంబర్ మార్చేటప్పుడు ఈ ఒక్క తప్పు చేస్తే.. మీ పాత చాట్స్ అన్నీ గోవిందా!

స్లిమ్ లుక్‌తో అదరగొడుతున్న Samsung Galaxy S26 FE.. భారత్‌లో దీని ధరెంతంటే?

రూ.9,000 డిస్కౌంట్‌తో శాంసంగ్ గెలాక్సీ A56 5G.. ఇంతకంటే బెస్ట్ ఆఫర్ మళ్లీ రాదు!

బరువు తగ్గడం ఇక ఈజీ.. ఒప్పో నుంచి అధునాతన ‘ఫ్యాట్ బర్నింగ్ వాచ్’ వచ్చేస్తోంది!

యాపిల్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. iPhone 18 Pro చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే!

Big Stories

Advertisement
×