E-Paper
Advertisement

మీ డేటా సేఫ్‌గా ఉండాలా? ChatGPTలో ఈ ఒక్కటి ఆఫ్ చేయండి చాలు!

మీ డేటా సేఫ్‌గా ఉండాలా? ChatGPTలో ఈ ఒక్కటి ఆఫ్ చేయండి చాలు!
Advertisement

ChatGPT data privacy settings: నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రతీ చిన్న విషయానికి చాట్‌జీపీటీని ఆశ్రయించే వారి సంఖ్య కోట్లలో ఉంది. ఆఫీస్ ప్రాజెక్ట్‌ల నుంచి పర్సనల్ ఐడియాల వరకూ ప్రతీదీ దీనితోనే షేర్ చేస్తున్నాం. అయితే.. యూజర్లు టైప్ చేసే ప్రతి అక్షరం, వారు అడిగే ప్రతీ ప్రశ్న ఓపెన్ ఏఐ కంపెనీ సర్వర్లలో స్టోర్ అవుతాయనేది ఎంత నిజమో, వాటిని ఏఐ మోడల్స్ మరింతగా మెరుగు పరచడానికి వాడుతున్నారనేది కూడా అంతే నిజం. ఇది మీ ప్రైవసీకి పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది. ఇంతకీ మీ డేటా సేఫ్‌గా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఏఐ ట్రైనింగ్ అంటే ఏంటి? ఎందుకు ప్రమాదం?

మనం ChatGPT తో మాట్లాడేటప్పుడు, ఆ చాట్ హిస్టరీని ఓపెన్ఏఐ కంపెనీ తమ సిస్టమ్‌ను మరింత స్మార్ట్‌గా మార్చడానికి వాడుకుంటుంది. అంటే.. మీరు మీ పర్సనల్ లైఫ్, బిజినెస్ సీక్రెట్స్ లేదా బ్యాంకింగ్ విషయాలు ఏవైనా షేర్ చేసి ఉంట.. అవి భవిష్యత్తులో వేరే యూజర్లకు సమాధానాలు ఇచ్చేటప్పుడు బయటపడే ఛాన్స్ ఉంది. అందుకే టెక్ నిపుణులు చాట్ జీపీటీ యూజర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ప్రైవసీ గైడ్‌లైన్స్ ప్రకారం, యూజర్లు తమ డేటా ప్రైవసీపై పూర్తి నియంత్రణ కలిగి ఉండటం చాలా ముఖ్యం.

ప్రైవసీని కాపాడుకోవడానికి ఈజీ స్టెప్స్:

Advertisement

మీ డేటాను ఏఐ ట్రైనింగ్ నుంచి తప్పించడానికి ఓపెన్ఏఐ ఒక చక్కటి ఆప్షన్‌ను అందించింది. దానిని మనం సరిగ్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రాసెస్ కింద విధంగా ఉంటుంది.

లాగిన్ అవ్వండి: ముందుగా మీ మొబైల్ లేదా సిస్టమ్‌లో ChatGPT అకౌంట్‌ను ఓపెన్ చేయండి.

Advertisement

సెట్టింగ్స్ ఓపెన్ చేయండి: మీ ప్రొఫైల్ ఐకాన్ లేదా సెట్టింగ్స్ (Settings) ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

డేటా కంట్రోల్స్: అక్కడ కనిపించే ‘Data Controls’ లేదా ‘Privacy & Security’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.

ఆప్షన్ డిసేబుల్ చేయండి: అందులో ‘Improve the model for everyone’ లేదా ‘Chat history & training’ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని ఆఫ్‌ (Disable) చేయండి.

ఒకసారి ఈ సెట్టింగ్ మార్చిన తర్వాత.. మీరు ఇకపై చేసే చాట్స్‌ని కంపెనీ ఏఐ ట్రైనింగ్ కోసం ఉపయోగించదు. దీని వల్ల మీ పర్సనల్ డేటాకు పూర్తి సేఫ్టీ ఉంటుంది. అయితే గుర్తుంచుకోండి. ఈ ఆప్షన్ ఆఫ్ చేయడం వల్ల.. మీ చాట్ హిస్టరీ మీ సైడ్ సేవ్ అవ్వకపోవచ్చు. కానీ మీ ప్రైవసీకి మాత్రం పూర్తి సేఫ్టీ ఉంటుంది.

Also Read: సైబర్ కేటుగాళ్ల కొత్త డ్రామా..ఫేక్ ఆఫర్లతో మీ అకౌంట్ ఖాళీ!

టెక్ ట్రెండ్స్ మారుతున్న కొద్దీ.. మన ప్రైవసీని మనమే కాపాడుకోవడం చాలా అవసరం. సోషల్ మీడియాలో.. వచ్చే తప్పుడు వార్తలను నమ్మకుండా.. అఫీషియల్ సెట్టింగ్స్ ద్వారా మీ అకౌంట్‌ను సెక్యూర్ చేసుకోండి. ముఖ్యంగా ఆఫీస్ ఉద్యోగులు, స్టూడెంట్స్ ఈ సెట్టింగ్‌ను తప్పకుండా చెక్ చేసుకోవడం మంచిది.

టెక్నాలజీ మన మంచికే అయినా.. దాన్ని ఎలా వాడాలో, మన డేటాను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం స్మార్ట్ యూజర్ లక్షణం. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే మీ చాట్ జీపీటీ అకౌంట్ ఓపెన్ చేసి ఈ సెట్టింగ్ మార్చేయండి, మీ ప్రైవసీని కాపాడుకోండి.

Related News

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేసాయ్..షాపింగ్‌కు రెడీ అయిపోండి!

రూ.54,999 ఫోన్ ఇప్పుడు ఇంత తక్కువకా? Vivo Y51 Pro 5Gపై క్రేజీ ఆఫర్!

iPhone 17 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,000 వరకు ఆదా చేసుకునే ఛాన్స్!

QR స్కాన్ అవసరం లేదు.. ట్యాప్ చేస్తే చాలు, UPIలో కొత్త పేమెంట్ ఫీచర్!

వాట్సప్ నెంబర్ మార్చేటప్పుడు ఈ ఒక్క తప్పు చేస్తే.. మీ పాత చాట్స్ అన్నీ గోవిందా!

స్లిమ్ లుక్‌తో అదరగొడుతున్న Samsung Galaxy S26 FE.. భారత్‌లో దీని ధరెంతంటే?

రూ.9,000 డిస్కౌంట్‌తో శాంసంగ్ గెలాక్సీ A56 5G.. ఇంతకంటే బెస్ట్ ఆఫర్ మళ్లీ రాదు!

Big Stories

Advertisement
×