E-Paper
Advertisement

గూగుల్ మ్యాప్స్ అమేజింగ్ ఫీచర్..మీ పార్కింగ్ లొకేషన్ ఇక ఎప్పటికీ మర్చిపోరు!

గూగుల్ మ్యాప్స్ అమేజింగ్ ఫీచర్..మీ పార్కింగ్ లొకేషన్ ఇక ఎప్పటికీ మర్చిపోరు!
Advertisement

Google Maps parking location saver: కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మన కారును ఎక్కడో ఒకచోట పార్క్ చేసి పనుల్లో పడిపోతాం. షాపింగ్ అయిపోయి తిరిగి వచ్చి చూస్తే..అసలు కారు ఎక్కడ పెట్టామో గుర్తులేక తలపట్టుకోవడం చాలా మందికి అనుభవమే! పెద్ద పెద్ద మాల్స్, రద్దీ రోడ్లలో ఈ పార్కింగ్ టెన్షన్ మామూలుగా ఉండదు. ఈ చిన్న సమస్యకు చెక్ పెట్టడానికి గూగుల్ మ్యాప్స్‌లో ఒక సూపర్ హిడెన్ ఫీచర్ ఉంది. అదే ‘సేవ్ పార్కింగ్ లొకేషన్’! మీ డైలీ లైఫ్‌ను మరింత స్మార్ట్‌గా,ఈజీగా మార్చే ఈ ట్రెండింగ్ ట్రిక్‌తో మీ కారును సెకన్లలో మళ్లీ కని పెట్టేయండి!

గూగుల్ మ్యాప్స్‌లో కార్ పార్కింగ్ సేవ్ చేయడం ఎలా?

మీ కారును ఎక్కడైనా పార్క్ చేసిన తర్వాత, దానిని మ్యాప్స్‌లో గుర్తుంచుకోవడం చాలా ఈజీ. ఆండ్రాయిడ్ ,ఐఫోన్ యూజర్లు ఎవరైనా సరే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే సరి పోతుంది.

Advertisement

జీపీఎస్ ఆన్ చేయండి: మీరు కారు పార్క్ చేసిన వెంటనే మీ ఫోన్‌లో లొకేషన్ ఆన్ చేసి గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయండి.

బ్లూ డాట్‌పై క్లిక్ చేయండి: మ్యాప్‌లో మీ ప్రస్తుత లొకేషన్‌ను సూచించే నీలిరంగు చుక్క కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయండి.

Advertisement

సేవ్ లొకేషన్ ఆప్షన్: ఆ బ్లూ డాట్‌పై క్లిక్ చేయగానే.. స్క్రీన్ పై కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో ‘Save parking’ లేదా ‘Set parking location’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేయండి.

నోట్స్ , టైమ్ యాడ్ చేసుకోండి: కావాలంటే.. మీరు పార్క్ చేసిన ప్లేస్ చుట్టూ ఉన్న ల్యాండ్‌ మార్క్ లేదా ఫ్లోర్ నంబర్‌ను నోట్స్ రూపంలో రాసుకోవచ్చు. అలాగే పార్కింగ్ మీటర్ టైమ్ ఉంటే దానిని కూడా సెట్ చేసుకోవచ్చు.

ఇంతే! ఈ చిన్న ప్రాసెస్‌తో మీ కారు లొకేషన్ గూగుల్ మ్యాప్స్‌లో సేవ్ అయిపోతుంది. మీరు షాపింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు, మ్యాప్స్‌లో ‘Parked car’ అని సెర్చ్ చేస్తే చాలు, కారు ఉన్న చోటుకి రూట్ క్లియర్‌గా చూపిస్తుంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేసాయ్..షాపింగ్‌కు రెడీ అయిపోండి!

ఈ ట్రిక్ వల్ల కలిగే లాభాలు:

చాలా మంది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ముఖ్యంగా.. పెద్ద పెద్ద మాల్స్ అండర్‌ గ్రౌండ్ పార్కింగ్ లాట్లలో సిగ్నల్స్ సరిగ్గా రాక ఇబ్బంది పడుతుంటాం. అలాంటి సమయాల్లో.. గూగుల్ మ్యాప్స్ ఆఫ్‌లైన్ లేదా సేవ్డ్ లొకేషన్ ఫీచర్ చాలా బాగా పని చేస్తుంది. ఈ ట్రిక్ వల్ల మీ విలువైన సమయం ఆదా అవ్వడంతో పాటు అనవసరమైన టెన్షన్ కూడా తప్పుతుంది.

టెక్నాలజీ మనకు అందించిన.. ఈ అద్భుతమైన ఫీచర్లను.. సరిగ్గా వాడితే మన పనులు ఎంత ఈజీ అవుతాయో చూడండి. ఇకపై మీరు ఎక్కడికి వెళ్లినా కారు పార్కిగ్ గురించి టెన్షన్ పడాల్సిన పనే లేదు. వెంటనే ఈ ట్రిక్‌ను ట్రై చేసి మీ ప్రయాణాలను మరింత స్మార్ట్‌గా మార్చుకోండి!

Related News

యూట్యూబ్ సంపాదన ఇక మరింత టఫ్..కొత్త నిబంధనల పూర్తి వివరాలు!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేసాయ్..షాపింగ్‌కు రెడీ అయిపోండి!

మీ డేటా సేఫ్‌గా ఉండాలా? ChatGPTలో ఈ ఒక్కటి ఆఫ్ చేయండి చాలు!

రూ.54,999 ఫోన్ ఇప్పుడు ఇంత తక్కువకా? Vivo Y51 Pro 5Gపై క్రేజీ ఆఫర్!

iPhone 17 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,000 వరకు ఆదా చేసుకునే ఛాన్స్!

QR స్కాన్ అవసరం లేదు.. ట్యాప్ చేస్తే చాలు, UPIలో కొత్త పేమెంట్ ఫీచర్!

వాట్సప్ నెంబర్ మార్చేటప్పుడు ఈ ఒక్క తప్పు చేస్తే.. మీ పాత చాట్స్ అన్నీ గోవిందా!

Big Stories

Advertisement
×