E-Paper
Advertisement

Anjali Sarvani : ఆదోని అమ్మాయికి భారత్ జట్టులో చోటు.. ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపిక..

Anjali Sarvani : ఆదోని అమ్మాయికి భారత్ జట్టులో చోటు.. ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపిక..
Advertisement

Anjali Sarvani : ఆంధ్రప్రదేశ్ అమ్మాయి భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆ జట్టులో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అంజలి శర్వాణికి చోటు దక్కింది. డిసెంబర్‌ 9 నుంచి 20 వరకు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ జరగనుంది.

టీమ్‌ ఇండియాకు అంజలి శర్వాణి ఎంపిక కావడంపై ఆదోని ప్రాంతంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. అంజలి తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అంజలి తల్లి గృహిణిగా ఉన్నారు. స్థానిక మిల్టన్‌ ఉన్నత పాఠశాలలో అంజలి పదోతరగతి వరకు చదివింది. ఆ తర్వాత క్రికెట్‌పై ఆమెకున్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో క్రికెట్‌ వైపు అడుగులు వేసింది అంజలి. జూనియర్ లెవల్ లో బాగా రాణించి భారత జట్టుకు ఎంపికైంది.

Advertisement

25 ఏళ్ల అంజలి లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ బౌలర్. ఇటీవల ఇండియా -ఏ, ఇండియా-బీ, ఇండియా-సీ జట్ల మధ్య జరిగిన టోర్నిలో అంజలి ఆడింది. భారత్- ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించి పేసర్ బౌలర్ గా రాణించింది. ఈ ప్రదర్శనతో ఇప్పుడు భారత్ జట్టులో స్థానం దక్కించుకుంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×