E-Paper
Advertisement

Africa T20 Cup: ఆసియా క‌ప్ త‌ర‌హాలోనే ఆఫ్రికా T20 క‌ప్..ఇక ఫ్యాన్స్ కు పండ‌గే

Africa T20 Cup: ఆసియా క‌ప్ త‌ర‌హాలోనే ఆఫ్రికా T20 క‌ప్..ఇక ఫ్యాన్స్ కు పండ‌గే
Advertisement

Africa T20 Cup:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు మరో అదిరిపోయే శుభవార్త అందింది. అతి త్వరలోనే మరో టి20 టోర్నమెంట్ తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ ( Asia Cup) తరహాలోనే ఆఫ్రికా టీ20 కప్ తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని నేషనల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఆసియా కప్ చాలా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఆఫ్రికా టీ20 కప్ ( Africa T20 Cup) నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనిపై అతి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.

Also Read: Inzamam-ul-Haq: కేకేఆర్‌, పంజాబ్ మ్యాచ్ ర‌ద్దు వెనుక కుట్ర‌లు…క్లౌడ్ బరస్ట్ క్రియేట్ చేశారంటూ

ఆసియా క‌ప్ త‌ర‌హాలోనే ఆఫ్రికా T20 క‌ప్

Advertisement

ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ ( African Cricket Association) అతి త్వరలోనే నిర్వహించే ఆఫ్రికా T20 కప్ కోసం మొత్తం, ఆఫ్రికన్ ఖండానికి సంబంధించిన జట్లను తయారు చేసేందుకు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా క్రికెట్ జట్లు పాల్గొంటారని సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి అయితే ఈ మూడు జట్లను ఫైనల్ చేశారని అంటున్నారు. వీటితో పాటు జెనియా, కెన్యా జట్లు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆసియా కప్ టోర్నమెంట్ చాలా సక్సెస్ ఫుల్ గా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆసియా క్రికెట్ బోర్డు ( ACB) నిర్వహిస్తోంది. ఇక ఈ ఆఫ్రికన్ టి20 లీగ్ కూడా ప్రతి సంవత్సరం కాకుండా రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేలా ఆ సందర్భం అవుతున్నారు.

అయినప్పటికీ షెడ్యూల్ కుదురుతుందా ? లేదా ? అనే టెన్షన్ లో కూడా జట్లు ఉన్నాయి. ఐసీసీ షెడ్యూల్ లేని సమయాలలో ఈ టోర్నమెంట్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముందుగా ఈ ఆలోచన చేసింది క్రికెట్ సౌత్ఆఫ్రికా అని తెలుస్తోంది. బిజీ షెడ్యూలు ఉంటే, కేటగిరి ఏ ప్లేయర్లతో ఆయన ఈ టి20 లీగ్ నిర్వహించాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఐసీసీ ఈవెంట్లు ఉంటే ఆ సమయంలో B కేటగిరి జట్టును వాడుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే ఈ టోర్నమెంట్ కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే దక్షిణాఫ్రికా, నమీబియా అలాగే జింబాబ్వే క్రికెట్ జట్లు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఆసియా కప్ ఎప్పుడు ప్రారంభమైందంటే

Advertisement

ఆసియా ఖండానికి సంబంధించిన క్రికెట్ జట్లు పాల్గొనే ఆసియా కప్ 1984లో ప్రారంభం అయింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు నాలుగేళ్లకు ఒకసారి కూడా నిర్వహించే పరిస్థితులు ఉన్నాయి. 2025 ఆసియా కప్ టోర్నమెంట్ దుబాయ్ వేదికగా జరగగా.. టీమిండియానే ఛాంపియన్ నిలిచింది. ఇటు బంగ్లాదేశ్ 2027లో ఆసియా కప్ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వనుంది.

Also Read: Farhan – Smith: సింగిల్ తీయ‌కుండా స్మిత్ ను అవ‌మానించిన ఫ‌ర్హాన్..బాబ‌ర్ ప‌గ‌ను తీర్చుకున్నాడుగా

 

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×