E-Paper
Advertisement

HBD Allu Arjun : వెండితెరపై ఐకాన్ స్టార్ ప్రభంజనం.. టాలీవుడ్ లో ఏకైక హీరోగా రికార్డ్..!

HBD Allu Arjun : వెండితెరపై ఐకాన్ స్టార్ ప్రభంజనం.. టాలీవుడ్ లో ఏకైక హీరోగా రికార్డ్..!
Advertisement

HBD Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇప్పుడు స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు ఎదిగారు.. పుష్ప సినిమా వరకు కేవలం ఇండియన్ స్టార్ గానే ఉన్నాడు. ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.. ప్రస్తుతం ఈయన తమిళ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు అన్న విషయం అందరికీ తెలుసు. ఈయన బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను మనం తెలుసుకుందాం..

గంగోత్రి టూ ఐకాన్ స్టార్ వరకు..

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. గంగోత్రి మూవీతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ సినిమా అతని లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన నటించిన సినిమాలు కొన్ని డిజాస్టర్ గా మారినా కూడా.. ఆ తర్వాత కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టుగా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి.. పుష్ప మూవీతో అల్లు అర్జున్ కాస్త మల్లు అర్జున్ లాగా మారాడు. ‘పుష్ప: ది రైజ్’ ఆయన కెరీర్‌నే మార్చేసింది. తగ్గేదే లే అంటూ ఆయన చూపించిన మేకోవర్, మేనరిజమ్స్, గ్లోబల్ స్థాయిలో రికార్డును బ్రేక్ చేసింది..

అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు..

Advertisement

ఈయన నటించిన పుష్ప మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు పాన్ వరల్డ్ లో రిలీజ్ అయ్యి సరికొత్త రికార్డుని సృష్టించింది. అంతే కాదు ఈ మూవీకి అతనికి జాతీయ అవార్డు కూడా దక్కిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఏ హీరోకి దక్కని ఏకైక రికార్డు అల్లు అర్జున్ కు దక్కింది.

Also Read :వామ్మో.. అషు రెడ్డి నెలకు అంత సంపాదిస్తుందా..?

‘AA22’ సినిమా విషయానికొస్తే..

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.. దాదాపు 70 శాతం వరకు షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ హిట్ అయితే మాత్రం అల్లు అర్జున్ క్రేజ్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది.. ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో ప్రేక్షకుల ముందుకు అల్లు అర్జున్ తీసుకురావాలి అని మా బిగ్ టీవీ మనసారా కోరుకుంటుంది.. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్..

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×