BigTV English

WPL: తెలుగు అమ్మాయికి జాక్ పాట్.. WPL వేలంలో అదుర్స్..

WPL: తెలుగు అమ్మాయికి జాక్ పాట్.. WPL వేలంలో అదుర్స్..

WPL: ఉమెన్ ప్రిమియర్ లీగ్. ఇండియాను షేక్ చేసే అవకాశమున్న టోర్నీ. ఐపీఎల్ గ్రాండ్ సక్సెస్ కావడంతో.. డబ్ల్యూపీఎల్ కూడా ఇరగదీస్తుందని భావిస్తున్నారు. అసలే అమ్మాయిలు.. వారి ఆట చూసేందుకు ప్రేక్షకులు ఎగబడతారని అంచనా వేస్తున్నారు. అందులోనూ, మహిళా క్రికెటర్లలో ఇప్పటికే చాలా మంది స్టార్ ప్లేయర్స్ గా సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నారు.


ముంబైలో జరిగిన WPL వేలంలో ఓ తెలుగు క్రికెటర్ కి మంచి ధర పలికింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 25 ఏళ్ల అంజలి శర్వాణి.. లెఫ్ట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ రాణిస్తున్నారు. 30 లక్షల బేస్ ప్రైజ్ కేటగిరీలో ఉన్న అంజలిని.. ఏకంగా 55 లక్షలకు వేలంలో సొంతం చేసుకుంది యూపీ వారియర్స్.

అంజలి శర్వాణి ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టారు. ఆ సిరీస్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో 8.73 సగటున 3 వికెట్లు పడగొట్టింది. టీమిండియా తరఫున ఓవరాల్‌గా 6 టీ20లు ఆడింది. ప్రజెంట్ సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ ఇండియన్ టీమ్ లో ప్లేయర్ గా కొనసాగుతున్నారు అంజలి శర్వాణి.


WPL యాక్షన్ లో అంజలికి 55 లక్షలు పలకడంపై ఆమె కుటుంబ సభ్యులు, అదోని వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×