E-Paper
Advertisement

Pawan: కోటలో ఉన్నా, పేటలో ఉన్నా ఒకటే.. జగన్ పై పవన్ పంచ్ లు..

Pawan: కోటలో ఉన్నా, పేటలో ఉన్నా ఒకటే.. జగన్ పై పవన్ పంచ్ లు..
Advertisement

Pawan: తాడేపల్లిలో యువతులపై వరుస ఘటనలు జరుగుతుండటంపై జనసేనాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేపులు, మర్డర్లు జరుగుతున్నా.. జగన్ సర్కారు పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందన్నారు.

తాడేపల్లిలోని ఎన్టీఆర్‌ కట్ట ప్రాంతంలో అంధురాలైన యువతి దారుణ హత్యపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. అంధ యువతి హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని విమర్శించారు. సీఎం నివాసం దగ్గరలోనే ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని నిలదీశారు. తాడేపల్లిలోనే గతంలో జరిగిన రేప్‌ కేసులో ఒక నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని ఫైర్ అయ్యారు. ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్.

Advertisement

తన నివాసం పరిసరాల పరిస్థితులనే సీఎం సమీక్షించుకోలేకపోతే ఎలా?.. మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే.. అంటూ మండిపడ్డారు. తల్లి పెంపకంలోనే లోపం ఉందని చెప్పే మంత్రులు ఉన్న ప్రభుత్వమిది అంటూ తప్పుబట్టారు. అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా కమిషన్‌ ఏం చేస్తోందని.. యువతిని కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలన్నారు జనసేనాని.

Related News

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం ప్రకటన, ఏపీ రాజకీయాల్లో…

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

Big Stories

Advertisement
×