BigTV English

Asian Games 2023 : వంద పతకాల వందే భారత్

Asian Games 2023 : వంద పతకాల వందే భారత్

Asian Games 2023 : చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు అదరహో అనిపిస్తున్నారు. ఆసియా గేమ్స్‌లో తొలిసారి వంద పతకాలను ఇండియా సాధించింది. తొలిసారి 25 స్వర్ణ పతకాలను భారత క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. 2018లో వచ్చిన 70 పతకాల రికార్డును ఈసారి.. భారత క్రీడాకారులు బ్రేక్‌ చేశారు. ఈ ఏడాది అథ్లెట్లు.. అత్యధిక పతకాలు సాధించారు. ఏడు స్వర్ణం, తొమ్మిది రజతం, ఆరు కాంస్య పతకాలతో మొత్తం 29 మెడల్స్‌ను దేశానికి అందించారు. ఇండోనేషియాలో 2018లో జరిగిన గేమ్స్ లో భారత క్రీడాకారులు 70 పతకాలను గెలుచుకున్నారు. వాటిలో 16 బంగారు, 23 రజతాలు, 31 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ జరిగిన ఆసియా క్రీడల్లో చైనా 358 పతకాలతో మొదటి స్థానంలో ఉండగా.. 169 పతకాలతో జపాన్ రెండవ స్థానంలో, 172 పతకాలతో రిపబ్లిక్ ఆఫ్ కొరియా మూడవ స్థానంలో ఉన్నాయి. తాజాగా భారత్ 100 పతకాలతో నాల్గవ స్థానంలో ఉంది.


ఈ ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో ఆర్చరీలో భారత్‌కు ఈ సారి తొమ్మిది పతకాలు వచ్చాయి. అందులో ఐదు స్వర్ణం, రెండు రజతం, రెండు కాంస్యం ఉన్నాయి. ఆర్చరీలో తెలుగు తేజం జ్యోతి సురేఖ మూడు గోల్డ్‌ మెడల్స్ అందించింది. అంతకుముందు.. ఆసియా క్రీడల్లో మహిళా కబడ్డీ పోటీల్లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. చైనీస్ తైపీపై జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడ్డారు. చివరి నిమిషంలో 26-25 పాయింట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. భారత రైడర్ పూజా హత్వాలా ఒకే రైడ్‌లో నాలుగు పాయింట్లు తీసుకొచ్చింది. దీంతో భారత్ ఖాతాలో 25 స్వర్ణ పతకాలు చేరాయి. పురుషుల కాంపౌండ్ ఆర్చరీలో ఓజాస్ ప్రవీణ్ కు స్వర్ణం దక్కగా, మహిళల పురుషుల కాంపౌండ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ వెన్నమ్‌కు స్వర్ణం లభించింది.

ఆసియా క్రీడల్లో పతకాలతో అదరగొడుతున్న భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. వంద పతకాల మైలురాయిని దాటి.. సరికొత్త రికార్డు సృష్టించిన వేళ ఆయన హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులను కలుసుకుని ముచ్చటించడానికి తాను ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. దేశానికి ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ.. ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి, అథ్లెట్లతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నా అంటూ మోదీ ట్వీట్‌ చేశారు.


అంతకుముందు 1951లో 51, 1982లో 57, 2006లో 53, 2010లో 65, 2014లో 57, 2018లో అత్యధికంగా 70 పతకాలను భారత ఆటగాళ్లు సాధించారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో వంద పతకాలు దాటి భారత్ క్రీడాకారులు‌ సత్తా చాటుతున్నారు.

https://x.com/narendramodi/status/1710487198544593024?s=20

Related News

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Big Stories

×