RGV Mobile Seized: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు పోలీసుల విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. ఇక తన వ్యూహం మూవీ రిలీజ్ సమయంలో వారిని అవమానపరిచే విధంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ఏపీలోని పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో టీడీపీ పార్టీ నాయకుడు ఆర్జీవీపై ఫిర్యాదు చేయడంలో కేసు నమోదైంది. కొద్ది రోజులుగా ఈ కేసు విషయంలో రామ్ గోపాల్ వర్మ కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో గతంలో హైకోర్టుకు ఆయన బెయిల్ కూడా ఇచ్చింది.
కించపరిచేలా కామెంట్స్
ఇటీవల ఈ కేసులో ఒంగోలు పోలీసులు ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వగా… ఆగష్టు 12న విచారణకు హాజరయ్యారు. అయితే విచారణలో భాగంగా పోలీసులు ఆర్జీవీ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. గత విచారణ సమయంలో రామ్ గోపాల్ వర్మ సెల్ ఫోన్ తీసుకురాలేదు. నేటి విచారణలో ఆర్జీవీ తన వెంట సెల్ఫోన్ తీసుకువెళ్లడంతో విచారణకు ముందే పోలీసులు ఫోన్ని సీజ్ చేశారు. కాసేపి క్రితమే ఆయన విచారణ ముగిసింది.అయితే మొబైల్ ఆయనకు తిరిగి ఇచ్చారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ కేసు విషయంలో పోలీసులు ఆర్జీవీ ఫోన్ను పరిశీలించనున్నారు.
రూ. 2 కోట్లపై కూడా విచారణ
గతంలో వైసీపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ కంపెనీ నుంచి ఆర్జీవీ రూ. 2 కోట్లు చెల్లించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ రెండు కోట్ల వ్యవహారంలోనూ పోలీసులు ఆర్జీవీని విచారించినట్టు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేయడం వెనక ఉన్న వారిపై కూడా ఆరా తీస్తున్నారు. కాగా గతేడాది నంబర్లో 10న మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఆర్జీవీపై మార్ఫింగ్ ఫోటోలపై కేసు నమోదైంది. దీంతో జనవరిలో విచారణకు రావాలని ఆదేశిస్తూ పోలీసుల నోటీసులు ఇచ్చారు. దీంతో ఆర్జీవీ షూటింగ్ కారణంగా విచారణకు రాలేనంటూ పలుమార్లు వాయిదా వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 7న ఆయన తొలిసారి విచారణకు హాజరయ్యారు.
ఆ తర్వాత అవసరమైనప్పుడు విచారణకు రావాలని పోలీసులు ఆర్జీవీకి సూచించారు. అయితే తనపై ఉన్న ఈకేసులను కొట్టివేయాలను కోరుతూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆర్జీవీ బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఆర్జీవీ అరెస్ట్ చేయడం, విచారించడం చేయొద్దని పోలీసులను ఆదేశించింది. ఆ తర్వాత పోలీసుల పిటిషన్ మేరకు ఆర్జీవీని విచారించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ఒంగోలు పోలీసులు గతనెల ఆర్జీవీకి నోటీసులు ఇవ్వగా.. షూటింగ్ కారణంగా హాజరు కాలేకపోయారు. దీంతో ఆగష్టు 12న విచారణకు రావాలని మరోసారి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో నేడి విచారణకు హాజరయ్యారు.