BigTV English

Matthew Wade : కుర్రాళ్ల వల్లే ఓడిపోయాం: ఆసిస్ కెప్టెన్

Matthew Wade : కుర్రాళ్ల వల్లే ఓడిపోయాం: ఆసిస్ కెప్టెన్

Matthew Wade : విశాఖలో ముగిసిన టీ20 మ్యాచ్ పై ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వెడ్ స్పందించాడు. కుర్రాళ్ల వల్లే ఓడిపోయామని తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో టీమిండియా చేతిలో ఓటమిపాలైంది.


ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆసిస్ కెప్టెన్ మాట్లాడుతూ  టీమ్ ఇండియా కుర్రాళ్ల బ్యాచ్ తో ఆడినప్పుడు మూడు అంశాలు గుర్తు పెట్టుకోవాలని తెలిసొచ్చిందని అన్నాుడు. ఒకటి మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంది. వారే మ్యాచ్ ని నిలబెట్టారు. వాళ్ల మీద ఫోకస్ పెట్టాలి.

రెండు విశాఖ పట్నం గ్రౌండ్ చిన్నదిగా ఉంది. అందుకని ఇక్కడ మేం యార్కర్లు సంధించాలి. అక్కడ మా బౌలర్లు విఫలమయ్యారు. సరిగ్గా బాల్ బ్యాట్ మీదకి వచ్చేసరికి సూర్య, ఇషాన్ కిషన్, రింకూ సింగ్ విధ్వంసం సృష్టించారని అన్నారు. మూడు టీ 20 బ్యాచ్ కుర్రాళ్లకు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. అది ఇప్పుడు పనికొచ్చింది. అందుకని మేం రాబోవు మ్యాచ్ ల్లో  మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నాడు.


ఇకపోతే తమ టీమ్ లో జోష్ ఇంగ్లిస్ ఇరగదీసి ఆడాడని అన్నాడు. తనొక్కడి సెంచరీతో మాకు భారీ స్కోరు దక్కింది. అయితే డిఫెండ్ చేసుకోవడానికి ఈ స్కోర్ చాలని అనుకున్నాం. కానీ సాధ్యమవలేదు. అయితే ఎల్లిస్ చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మ్యాచ్ ని ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లాడు. బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ యార్కర్లను సంధించలేకపోయాం. అదీకాకుండా చిన్న మైదానం కావడంతో వాటిని ఆపలేకపోయామని అన్నాడు.

అయితే ఆసిస్ కెప్టెన్ టీమ్ ఇండియా టీ 20 బ్యాచ్ పై చేసిన మూడు అంశాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కుర్రాళ్ల టీమ్ పై అద్భుత విశ్లేషణ చేశాడు. దీనిని టీమ్ మేనేజ్మెంట్ జాగర్తగా గమనించి వచ్చే మ్యాచ్ ల్లో ఆసిస్ ఈ అంశాలపై ఫోకస్ పెడుతుంది కాబట్టి, ఆ దిశగా దృష్టి పెట్టాలని అంటున్నారు. ఒకవేళ మిడిలార్డర్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి, అంతకుముందే ఓపెనర్లు నిలదొక్కుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై హెడ్ కోచ్ లక్ష్మణ్ ఫోకస్ చేయాలని, ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×