BigTV English

Australia Cricket Team : స్వదేశంలో ఆసీస్ కి తీవ్ర నిరాశ.. దండలేవి? చప్పట్లేవి?

Australia Cricket Team : స్వదేశంలో ఆసీస్ కి తీవ్ర నిరాశ.. దండలేవి? చప్పట్లేవి?

Australia Cricket Team : ఇండియాలో వరల్డ్ కప్ కి ఉన్న ఆదరణ చూసిన ఆస్ట్రేలియన్లు అదే ఉత్సాహంతో కప్ పట్టుకుని సిడ్నీ ఎయిర్ పోర్టులో దిగారు. ఎవ్వరూ వచ్చి పలకరించిన పాపాన పోలేదు. ప్రభుత్వం కూడా కనీస ఏర్పాట్లు చేయలేదు. దీంతో కెప్టెన్ కమిన్స్, ఇతర జట్టు సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అదే ఇండియాలో ఉన్న ఆదరణ ఏంటి? మన దేశంలోని దౌర్బాగ్యం ఏమిటి? అని కూడా అనుకుంటున్నారు.


ఇండియాలో క్రికెట్ కి ఉన్న ఆదరణ చూసి సాక్షాత్తూ దేశ ప్రధాని మోదీ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. ఓడిపోయిన ఆటగాళ్ల వద్దకు వెళ్లి మరీ ఓదార్చారు. గెలిచి కప్ తో వస్తే కనీసం క్రికెట్ బోర్డు కూడా కనీస స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయలేదని అనుకున్నారంట.

వీళ్లు పోతే పోయారు.. కనీసం పబ్లిక్ కూడా విష్ చేయలేదు, ఎవడి మటుకు వాళ్లు పోయారని వాపోయారంట. ప్రస్తుతం ఆసీస్ క్రికెటర్ల ఎయిర్ పోర్టు ఫోటోలన్నీ నెట్టింట  వైరల్ అవుతున్నాయి.


దారిపొడవునా ప్రజలకు చేతులు ఊపుకుంటూ, కప్పు చూపిస్తూ వెళదామని ఆశపడ్ట ఆస్ట్రేలియన్లు ఎంతో నిరాశకు గురయ్యారు. ఇండియాతో జరగనున్న టీ20 మ్యాచ్ ల కోసం కొందరు ఉండిపోయారు,కెప్టెన్ కమిన్స్ , వార్నర్ లాంటి సీనియర్లు స్వదేశానికి బయలుదేరారు.

‘వీళ్ల కోసమా,  ఇంత కష్టపడి మనం కప్ గెలిచింది’ అనే నిర్వేదంలో టీ20 కోసం ఇండియాలోనే ఉండిపోయిన ఆసీస్ క్రికెటర్లు మునిగిపోయారని సమాచారం.

ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలిపోతున్నాయి. అసలు ప్రపంచకప్ గెలిచారనే సంగతి ఆస్ట్రేలియన్లకు తెలుసా? అని ఓ అభిమాని ప్రశ్నించాడు. మన ఇండియాలా ఒక్క క్రికెట్ ని మాత్రమే వారు ప్రేమించరు, అన్ని ఆటలను సమానంగా చూస్తారని, అందుకే క్రికెట్ కి అంత ప్రాధాన్యం ఇవ్వలేదని రాసుకొచ్చారు.

ఆరుసార్లు గెలిచింది కాబట్టి, ప్రజలు కూడా లైట్ గా తీసుకున్నారని అంటున్నారు. ప్రతి నాలుగేళ్లకి ఒకసారి ఎవడెళ్లి దండలేసి, చప్పట్లు కొడతారు.. ఇంక పనులేమీ ఉండవా? అని అనుకున్నారేమో, అందుకే రాలేదని సెటైర్ల మీద సెటైర్లు పేల్చుతున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×