BigTV English

Australia Team : ఆరోసారి వరల్డ్ కప్ సాధిస్తుందా..? ఆసీస్ జట్టుపై అంచనాలేంటి?

Australia Team : ఆరోసారి వరల్డ్ కప్ సాధిస్తుందా..? ఆసీస్ జట్టుపై అంచనాలేంటి?
Australia Team

Australia Team : ఆస్ట్రేలియా.. 5 వన్డే వరల్డ్ కప్ లు సాధించిన టీమ్. ప్రతి ప్రపంచ కప్ లోనూ ఈ జట్టు ఫేవరేటే. 13వ ప్రపంచ కప్ లోనూ ఆసీస్ పై భారీ అంచనాలున్నాయి. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ భీకర ఫామ్ లో ఉన్నారు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ అందుబాటులో ఉన్నాడు. స్టివ్ స్మిత్, మార్నస్ లుబుషేన్ తో మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంది.


హిట్టర్లు మార్కస్ స్టొయినిస్ , గ్లెన్ మ్యాక్స్ వెల్ లతో ఈ జట్టు బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. కీపర్ అలెక్స్ కేరీ బ్యాట్ తోనూ అద్భుతాలు చేయలగల సత్తా ఉన్న బ్యాటర్ .భారత్ పిచ్ లు స్పిన్ కు అనుకూలంగా ఉంటాయి. డేవిడ్ వార్నర్, స్టివ్ స్మిత్, లబుషేన్, మాక్సెవెల్ స్పిన్ ను సమర్థంగా ఎదుర్కొగల బ్యాటర్లు. స్పిన్నర్లపై అటాకింగ్ బ్యాటింగ్ తోనూ ఒత్తిడి పెంచగలరు.

పేసర్లు మిచెల్ స్టార్క్ , ఫ్యాట్ కమిన్స్ ,హేజల్ వుడ్, సీన్ అబాట్ ప్రత్యర్థి బ్యాటర్లకు సవాల్ విసిరే బౌలర్లు. ఆల్ రౌండర్లు మిచెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్ లు అదనపు పేస్ బౌలింగ్ వనరులుగా ఉన్నారు. అందువల్లే హేజల్ వుడ్ , సీన్ అబాట్ చాలా మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. స్పిన్ విభాగంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు మ్యాక్స్ వెల్ తోడుఉన్నాడు. ఇలా ఆసీస్ బౌలింగ్ విభాగంగా చాలా బలంగా ఉంది. ఆల్ రౌండర్లు జట్టుకు గుడ్ బ్యాలెన్స్ తీసుకొచ్చారు.


అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లో హాట్ ఫేవరేట్. ఆ జట్టుపై విజయం ప్రత్యర్థి జట్లకు అంతవీజీ కాదు. ఆసీస్ టీమ్ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతూ ఎటాకింగ్ గేమ్ ఆడుతుంది. ఎలాంటి కండీషన్లలోనైనా విజయం సాధించే సత్తా ఉంది. భారత్ లో జరిగిన గత మూడు ప్రపంచ కప్ ల్లో ఆసీస్ ట్రాక్ రికార్డు బాగుంది. 1987లో ఈ జట్టు తొలి ప్రపంచ కప్ ఇక్కడే సాధించింది. 1996 వరల్డ్ కప్ లో ఫైనల్ ఓడింది. ఇక 2011 ప్రపంచ కప్ లోనే ఆసీస్ క్వార్టర్స్ లో భారత్ చేతిలో ఓడింది. మరి ఈసారి ఆసీస్ ఆరోసారి వరల్డ్ కప్ సాధిస్తుందా? అంచనాలను అందుకుంటుందా?

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×