BigTV English

US Open 2024: యూఎస్ ఓపెన్ 2024.. టాప్ సీడ్లకు షాక్.. ప్రపంచ నెంబర్ టు, త్రీ ఆటగాళ్లు ఔట్

US Open 2024: యూఎస్ ఓపెన్ 2024.. టాప్ సీడ్లకు షాక్.. ప్రపంచ నెంబర్ టు, త్రీ ఆటగాళ్లు ఔట్

US Open 2024: యూఎస్ ఓపెన్‌లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ టూ ఆటగాడు నవోక్ జకోవిచ్ టోర్నీ నుంచి నిష్కమించాడు. కెరీర్‌లో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకోవాలన్న ఆయన ఆశలు అడియాశలయ్యాయి.


అమెరికాలో జరుగుతున్న యూఎస్ ఓపెన్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో సెర్బియా ప్లేయర్, ప్రపంచ నెంబర్ టూ ఆటగాడు నవోక్ జకోవిచ్ ఊహించని రీతిలో ఓటమిపాలయ్యాడు. ప్రపంచంలో 28వ ర్యాంక్ ఆటగాడు చేతిలో ఖంగుతిన్నాడు.

సెర్బియాకు చెందిన జకోవిచ్- ఆస్ట్రేలియాకు చెందిన అలెక్సీ పాపిరిన్ మధ్య మ్యాచ్ జరిగింది. కేవలం నాలుగు సెట్లలో జకోవిచ్‌ను ఇంటికి పంపించాడు అలెక్సీ. తొలిసెట్‌ను గెలుచుకున్న అలెక్సీ, సెకండ్ సెట్‌లో అదే దూకుడు కనబరిచాడు.


ALSO READ: పారా ఒలింపిక్స్: రెండో రోజే పతకాల పంట

ఈలోగా తేరుకున్న జకోవిచ్, మూడో సెట్‌ను గెలుచుకున్నాడు. దీంతో అలెక్సీ పనైపోయిందని సగటు అభిమానులు భావించాడు. కానీ.. అలెక్సీ మైదానంలో జోరు చూసి ఒకానొక దశలో జకోవిచ్ షాకయ్యాడు. మొత్తానికి నాలుగు సెట్ల మ్యాచ్‌ను 6-4, 6-4, 2-6, 6-4 తేడాతో జకోవిచ్ ఓడిపోయాడు.

నాలుగు సార్లు అమెరికా ఓపెన్ గెలుచుకున్న జకోవిచ్, ఈసారి అదే జోరు కొనసాగాలించాలని భావించాడు. చివరకు అలెక్సీ చేతిలో చావు దెబ్బతిన్నాడు. సింపుల్‌‌గా చెప్పాలంటే 2024 ఏడాది జకోవిచ్‌కు కలిసిరాలేదు. ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్, ఇప్పుడు యూఎస్ ఓపెన్‌లో ఓటమి పాలయ్యాడు. కేవలం పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం దక్కించుకున్నాడు. అదొక్కటే ఆయనకు ఊరట. ఈ లెక్కన టెన్నిస్‌లో జకోవిచ్ శకం ముగిసిందని అంటున్నారు టెన్నిస్ విశ్లేషకులు.

యూఎస్ ఓపెన్‌లో శనివారం మరో సంచలనం నమోదైంది. స్పెయిన్ యువ ఆటగాడు, ప్రపంచ నెంబర్ త్రీ ప్లేయర్ కార్లోస్ అల్కరాస్ టోర్నీ నిష్క్రమించాడు. ప్రపంచ 74వ ర్యాంక్, నెదర్లాండ్‌ ఆటగాడు బొటిక్ వాండ్‌ చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది.

ఈ ఏడాది ఫుల్ జోష్‌లో ఉన్నాడు స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాస్. ఫ్రెంచ్, వింబుల్డన్, పారిస్ ఒలింపిక్స్‌లో రతజం గెలుచుకున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగాడు. స్టార్ ఆటగాడైన అల్కరాస్, ఓ అనామక ఆటగాడి చేతిలో కంగుతిన్నాడు.

కేవలం మూడుసెట్లలో మ్యాచ్‌ను ముగించాడు బొటిక్. దీంతో మూడు సెట్లను 6-1, 7-5, 6-5 తేడాతో విజయం సాధించిన ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇద్దరు టాప్ సీడ్ ఆటగాళ్లు వెనుదిరగడంతో ప్రపంచ నెంబర్ వన్ ఇటలీ ఆటగాడు సినన్, రష్యా ఆటగాడు మెద్విదేవ్ టైటిల్‌పై కన్నేశారు. మ్యాచ్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసరికి ఇంకెన్ని సంచనాలు నమోదవుతాయో చూడాలి.

 

 

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×