 
					Test Rules: క్రికెట్ లో టెస్ట్ లను సుదీర్ఘమైన ఫార్మాట్ గా అభివర్ణిస్తారు. ఒక్క టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులు ఆడాల్సి ఉంటుంది. ప్రతిరోజు టెస్ట్ లో మొత్తం మూడు సెషన్స్ ఉంటాయి. ఈ మూడు సెషన్ల చొప్పున మొత్తం 90 ఓవర్ల ఆట ఆడాల్సి ఉంటుంది. అందువల్ల ఆటగాళ్లకు నిర్దిష్ట వ్యవధిలో తగినంత విశ్రాంతి లభించే విధంగా ఈ సెషన్ లను విభజించారు. అవే టీ బ్రేక్, లంచ్ బ్రేక్. ఒక టెస్ట్ మ్యాచ్ జరిగే ఐదు రోజులపాటు ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా యాక్టివ్ గా ఉండాలి. అందుకే ఈ మ్యాచ్ లలో ఆటగాళ్లకు నిర్దిష్టంగా బ్రేకులు ఉంటాయి.
Also Read: Gambhir- Jemimah: అప్పుడు గంభీర్.. ఇప్పుడు జెమీమా..అవే మరకలు, వరల్డ్ కప్ 2027 లోడింగ్
ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ లో ప్రతిరోజు ఆట ప్రారంభమైన రెండు గంటల తరువాత తొలి సెషన్ ముగుస్తుంది. అప్పుడు ప్లేయర్స్ లంచ్ బ్రేక్ తీసుకుంటారు. ఈ లంచ్ బ్రేక్ 40 నిమిషాల పాటు ఉంటుంది. అయితే మ్యాచ్ సందర్భంగా మైదానంలో అటూ ఇటూ పరిగెత్తే బ్యాటర్ కి అయినా, బౌలర్, ఫీల్డర్లకు కాస్త శరీరం రీఛార్జ్ కావడానికి ఈ లంచ్ బ్రేక్ ఉపయోగపడుతుంది. ఈ సమయంలోనే ప్లేయర్లు ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం తీసుకున్నక మిగిలిన సమయాన్ని ఆటగాళ్లు రిఫ్రెష్ అయ్యేందుకు ఉపయోగించుకుంటారు. ఈ సమయంలో కొంతమంది ప్లేయర్స్ వేడి నీటి స్నానం చేస్తుంటారు. ఇక మరి కొంతమంది మెడిటేషన్, మరి కొంతమంది సహచరులతో సరదాగా గడుపుతారు.
ఇక మరికొంతమంది ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు కోచ్ తో కలిసి వ్యూహాలు రచిస్తుంటారు. భారత్ లో మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అవుతుంది. మొదటి సెషన్ ఉదయం 11:30 గంటల వరకు సాగుతోంది. ఇక 11:30 గంటల నుండి 12:10 వరకు లంచ్ బ్రేక్. మళ్లీ రెండవ సెషన్ మధ్యాహ్నం 12:10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇది రెండు గంటల పాటు కొనసాగి.. 2:10 గంటలకు టీ బ్రేక్ ఉంటుంది. ఈ బ్రేక్ 20 నిమిషాల పాటు తీసుకోవచ్చు. ఆ తర్వాత మరో రెండు గంటల పాటు ఆడిన తర్వాత.. ఆట ముగుస్తుంది.
టెస్టుల్లో సరికొత్త సాంప్రదాయానికి తెరలేవనుంది. గౌహటి వేదికగా భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే తొలి టెస్ట్ నుండి రెండు టీ బ్రేక్స్ అమలు కానున్నాయని సమాచారం. ఇందులో ఫస్ట్ సెషన్ 9 నుండి 11 గంటల వరకు, సెకండ్ సెషన్ 11:20 నుండి 1:20, మూడవ సెషన్ రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు ఉండనుందని క్రీడా వర్గాలు తెలిపాయి. అయితే భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే తొలి టెస్ట్ నుండి లంచ్ కి ముందు ఒక టీ బ్రేక్, లంచ్ తర్వాత మరొక టీ బ్రేక్ అమలులోకి రానుందని వెల్లడించాయి. ప్రస్తుతం లంచ్ తర్వాత మాత్రమే టీ బ్రేక్ ఉన్న విషయం తెలిసిందే.
19వ శతాబ్దం ప్రారంభంలో క్రికెట్ ని ఇంగ్లాండ్ జట్టు శాసించేది. ఈ క్రమంలో క్రికెట్ కి సంబంధించిన అన్ని నిబంధనలను మేర్లీబోన్ క్రికెట్ క్లబ్ రూపొందించింది. లంచ్, టీ బ్రేక్ ని టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ జట్టే ప్రవేశపెట్టింది. మొదట ఈ క్రికెట్ ని పెద్ద మనుషులు ఆడే ఆటగా అభివర్ణించారు. ఇక భారత్ లో రాజకుటుంబీకులు మాత్రమే ఈ క్రికెట్ ఆడేవారు. ఇదిలా ఉంటే.. టీ బ్రేక్ లో ఆటగాళ్లు స్నాక్స్, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, నట్స్ లాంటివి తీసుకుంటారు.