 
					Aus vs Ind, 2nd T20I: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 2nd T20I ) మధ్య ఇవాళ రెండో టి20 జరగనున్న సంగతి తెలిసిందే. మెల్బోర్న్ స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో టి20 జరగనుంది. అయితే ఈ టి20 నేపథ్యంలో కాసేపటికి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో గెలిచిన ఆస్ట్రేలియా, మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. అయితే, ఇవాళ్టి మ్యాచ్ లో కూడా అర్షదీప్ సింగ్ కు ఛాన్స్ దక్కలేదు.
Also Read: SHREYAS IYER: గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్.. కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India )మధ్య జరుగుతున్న ఈ రెండో టి20 లో టాస్ ఓడిపోయి టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసుకుంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు వరుసగా ఐదు టాస్ లు ఓడిపోయింది టీమిండియా. ఇందులో వన్డేలు కూడా ఉన్నాయి. ఇక ఇవాళ్టి రెండో టి20 మ్యాచ్ 1:45 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ లో ఉచితంగానే చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ లు తిలకించవచ్చు. అయితే అందరూ ఊహించినట్లుగానే రెండో టి20లో కూడా అర్షదీప్ సింగ్ తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఆల్ రౌండర్ పేరుతో హర్షిత్ రాణాను టీమిండియాకు రుద్దుతున్నారు. గంభీర్ తప్పుడు నిర్ణయాల కారణంగా అర్షదీప్ సింగ్ స్థానంలో హర్షిత్ రాణా వచ్చినట్లు సోషల్ మీడియాలో కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు 33 టీ20 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో టీమిండియా ఆధిపత్యాన్ని చెలాయించింది. వన్డేల్లో ఆస్ట్రేలియా దుమ్ములేపితే, టి20లో మాత్రం టీమిండియా చుక్కలు చూపించింది. ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య 33 మ్యాచులు జరగగా.. 20 మ్యాచ్ లలో టీమిండియానే విజయం సాధించింది. ఆస్ట్రేలియా 11 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించడం గమనార్హం. ఇంకా రెండు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు.
భారతదేశం (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్
Another day, another match, and another toss lost by India 😬#SuryakumarYadav #AUSvIND #CricketTwitter pic.twitter.com/ktCEMAOXC5
— InsideSport (@InsideSportIND) October 31, 2025