BigTV English
Advertisement

Rishabh Pant: రిషబ్ పంత్ చిలిపి పనులు.. తోటి ప్లేయర్ పై పడుకొని మరి.. కామాంధుడు అంటూ ట్రోలింగ్!

Rishabh Pant: రిషబ్ పంత్ చిలిపి పనులు.. తోటి ప్లేయర్ పై పడుకొని మరి.. కామాంధుడు అంటూ ట్రోలింగ్!

Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ గురించి క్రీడాభిమానులకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. తన తూఫాన్ బ్యాటింగ్ తో భారత్ ని ఎన్నోసార్లు గెలుపు బాట పట్టించాడు. అంతేకాకుండా వికెట్ల వెనకాల అద్భుతమైన క్యాచ్ లు పడుతూ.. మహేంద్ర సింగ్ ధోని లాగా వేగంగా స్టంప్స్ చేస్తుంటాడు. పంత్ బ్యాటింగ్ కి వీరాభిమానులు చాలామంది ఉన్నారు. క్రీజ్ లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడే రిషబ్ పంత్.. ఫీల్డింగ్ సమయంలో వికెట్ల వెనకాల, బయట కూడా ఎంతో ఫన్నీగా ఉంటాడు.


Also Read: Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మపై దారుణంగా ట్రోలింగ్.. ఇదేం బ్యాగ్ రా అంటూ

తన హాస్యంతో, చేష్టలతో సహచర ఆటకాలతో పాటు ప్రత్యర్థి జట్టు ప్లేయర్లను కూడా ఆట పట్టిస్తుంటాడు. రిషబ్ పంత్ సంభాషణలు చాలాసార్లు స్టంప్ మైకులలో రికార్డ్ చేయగా.. ఆ ఫన్నీ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓసారి బంగ్లాదేశ్ జట్టు ఆటగాళ్లను ఫీల్డ్ సెట్ చేసిన సందర్భం క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇలా రిషబ్ పంత్ సరదా చేష్టలకు సంబంధించిన వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.


తోటి ప్లేయర్ పై పడుకున్న పంత్:

ఇలా ఎప్పుడూ మైదానంలో ఫన్నీగా ఉండే రిషబ్ పంత్.. ఓసారి సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా చేసిన ఓ హాస్య భరిత సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 45వ ఓవర్ వద్ద హెర్మాన్ ఆడిన ఓ బంతిని షార్ట్ లెగ్ వద్ద స్లిప్ లో ఉన్న ఫీల్డర్.. క్యాచ్ మిస్ చేశాడు. అలా ఆ ఫీల్డర్ క్యాచ్ మిస్ చేసి కింద పడుకున్న సమయంలో.. వికెట్ల వెనకాల ఉన్న రిషబ్ పంత్ వెళ్లి ఆ ఫీల్డర్ పై పడుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నటిజెన్లు ఇలాంటివి కేవలం రిషబ్ పంత్ కి మాత్రమే సాధ్యం అవుతాయని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

రీఎంట్రీ కి సిద్ధమైన పంత్:

అండర్సన్ – టెండుల్కర్ ట్రోఫీ సమయంలో పాదానికి తీవ్ర గాయం కావడంతో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయంతోనే ఆ మ్యాచ్ లో క్రీజ్ లోకి వచ్చి హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత మెడికల్ స్కానింగ్ లో పంత్ పాదం వద్ద ఎముక విరిగినట్లు తేలడంతో కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. దీంతో అతడు ఆసియా కప్, వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో పాల్గొనలేదు. అలా ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడి.. చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న రిషబ్ పంత్ రీఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న పంత్.. త్వరలో జరగబోయే రంజీ ట్రోఫీలో తన సొంత జట్టు ఢిల్లీ తరుపున బరిలోకి దిగనున్నాడని సమాచారం. నవంబర్ లో సౌత్ ఆఫ్రికా తో జరిగే రెండు టెస్టుల సిరీస్ లో పంత్ టీం ఇండియాలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

Gambhir: గంభీర్‌ ఓ చీడ పురుగు.. బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చ‌డంపై ట్రోలింగ్‌, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా దించుకో!

AUS vs IND: గంభీర్ త‌ప్పుడు నిర్ణ‌యాలు…రెండో టీ20లో ఆస్ట్రేలియా విజ‌యం

AUS vs IND: హ‌ర్షిత్ రాణా ఊచ‌కోత‌.. 104 మీట‌ర్ల సిక్స‌ర్..ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Jemimah: ధోని బ్యాట్ కంటే, నా బ్యాట్ బరువే ఎక్కువ.. జెమిమా కామెంట్స్ వైరల్

Aus vs Ind, 2nd T20I: టాస్ ఓడిన టీమిండియా..అర్ష‌దీప్ కు మ‌రోసారి నిరాశే..తుది జ‌ట్లు ఇవే

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మపై దారుణంగా ట్రోలింగ్.. ఇదేం బ్యాగ్ రా అంటూ

Test Rules: టెస్టుల్లో కొత్త సంప్రదాయం.. ఇక రెండు టీ బ్రేకులు!

Big Stories

×