 
					Jemimah: మనదేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ మరో ఆటకు లేదంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్దుల వరకు అంతా ఈ జెంటిల్మెన్ గేమ్ ని ఇష్టపడతారు. ఈ గేమ్ లో ప్రతి పరుగుకి విలువ ఉంటుంది. ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ ఫలితం మారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే బ్యాటర్ ఒక్క పరుగు చేయాలన్నా.. బౌండరీ లేదా సిక్స్ బాధలన్నా వారి చేతిలోని బ్యాట్ వాళ్లకు అనుకూలమైందిగా ఉండాలి. ఈ కారణంగానే ఎందరో స్టార్ క్రికెటర్లు తేలికపాటి బ్యాట్లను వాడుతారు. కానీ కొందరు ఇందుకు పూర్తిగా విరుద్ధం. కొంతమంది క్రికెటర్లు అత్యధిక బరువు ఉన్న బ్యాట్లను ఉపయోగిస్తారు.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ చిలిపి పనులు.. తోటి ప్లేయర్ పై పడుకొని మరి.. కామాంధుడు అంటూ ట్రోలింగ్!
పురుషులతో సమానంగా మహిళలు కూడా క్రికెట్ ఆడేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. మహిళల క్రికెట్ కి పెరుగుతున్న ఆదరణే ఇందుకు నిదర్శనం. పురుషులు, మహిళా క్రికెట్ లో ఎటువంటి తేడాలు ఉండవు. కానీ వారు ఉపయోగించే బ్యాట్లలో మాత్రం కొంత వ్యత్యాసం ఉంటుంది. ఐసీసీ, బీసీసీఐ నిబంధనల మేరకు వారి బ్యాట్లను తయారు చేస్తారు. పురుషులు వాడే బ్యాట్ {BAT} కంటే మహిళలు వినియోగించే బ్యాట్ల బరువు తక్కువగా ఉంటుందట. పురుషుల బ్యాట్ల బరువు 1 కిలో 200 గ్రాములు ఉండగా.. మహిళల బ్యాట్లు 1 కిలో 100 గ్రాముల బరువు ఉంటుంది. ఈ రెండు బ్యాట్లను ఒకే యంత్రంలో తయారు చేసినప్పటికీ.. నిబంధనలను అనుసరించి వాటిలో చిన్న మార్పులు చేస్తారు. ఇక బ్యాట్ల పొడవు విషయానికి వస్తే.. పురుషుల బ్యాట్ల పొడవు 38 అంగుళాలు కాగా.. మహిళల బ్యాట్లు 33 అంగుళాల పొడవు మాత్రమే ఉంటాయి.
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 మెగా టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ లో టీమిండియా క్రికెటర్ జమీమా రోడ్రిక్స్ సెంచరీ {127} పరుగులతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ప్రస్తుతం క్రీడాభిమానులు జమీమా గురించి మాట్లాడుకుంటున్నారు. సెమీ ఫైనల్ లో తన అద్భుత ప్రదర్శనతో భారత జట్టుని ఫైనల్ వరకు తీసుకువెళ్లిన జమీమా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Also Read: Abhishek Sharma: అభిషేక్ శర్మపై దారుణంగా ట్రోలింగ్.. ఇదేం బ్యాగ్ రా అంటూ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జమీమా.. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ ఇంటర్వ్యూలో మహేంద్రసింగ్ ధోని వాడే బ్యాట్ కంటే.. తన బ్యాట్ బరువే ఎక్కువ అని కామెంట్స్ చేసింది. తన బ్యాట్ బరువు 1 కిలో 200 గ్రాములు ఉంటుందని.. ధోని వాడే బ్యాట్ తన బ్యాట్ బరువు కంటే తక్కువగా ఉంటుందని కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో జమీమా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీసాయి.
Dhoni – "What's the weight of your bat?"
Jemimah – "1200 grams."
Dhoni – "You use a heavier bat than me!" 😂🤣 pic.twitter.com/xsDTqmpZcP
— ` (@WorshipDhoni) October 30, 2025