Gulbadin Naib On Rohit-Kohli: టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య ప్రస్తుతం మూడు టి20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. మరో మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా చిట్టచివరి టీ20 ఇవాళ రాత్రి 7:30 గంటల ప్రాంతంలో షురూ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా జట్టు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు గుల్బదిన్ నైబ్. ఆఫ్ఘనిస్తాన్ తో ఆడేందుకు టీమిండియా B జట్టును పంపించారని హేళన చేస్తూ మాట్లాడారు. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ లేకపోతే మ్యాచ్లో పసలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. శ్రేయస్ అయ్యర్ ఇలాంటి బచ్చగాళ్ళను దించడం ఏంటని ప్రశ్నించారు. అసలు ఇండియా టూర్ తనకు ఏమాత్రం సంతృప్తి ఇవ్వలేదని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు గుల్బదిన్ నైబ్. దీంతో ఆఫ్గనిస్తాన్ ఆటగాడు గుల్బదిన్ నైబ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య మూడు టి20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టి20 సిరీస్ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు గుల్బదిన్ నైబ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా అంటేనే విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ అని గుర్తు చేశారు. అలాంటిది వాళ్లు ఇద్దరు కూడా టీమిండియా టి20 జట్టులో లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
వాళ్ళిద్దరూ జట్టులో ఉంటారని తాను ఊహించి… ఇండియా టూర్ కు వచ్చినట్లు బాంబు పేల్చారు. కానీ వాళ్ళిద్దరూ లేకపోవడం తనకు ఏమాత్రం నచ్చలేదని సీరియస్ అయ్యారు. టీమిండియా టి20 దట్టిలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఉంటేనే మ్యాచ్ పస ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా టి20 జట్టులోకి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్లు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కూడా… వెనక్కి తీసుకోవాలని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే చాలామంది అంతర్జాతీయ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించి… వెనక్కి తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని వివరించారు. అచ్చం అలాగే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ చేయాలని సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారు ఆఫ్గనిస్తాన్ ఆటగాడు గుల్బదిన్ నైబ్. ఈ క్రమంలో ఆఫ్గనిస్తాన్ ఆటగాడు గుల్బదిన్ నైబ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు లేకున్నా కూడా శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా కెప్టెన్ గా కొనసాగుతున్నాడని ప్రశంసల వర్షం కురిపించారు గుల్బదిన్ నైబ్. తన దృష్టిలో శ్రేయస్ అయ్యర్ పిల్ల బచ్చాగాడు అంటూ బాంబు పేల్చారు. అయితే సీనియర్లు లేకుండానే టీమిండియాను లీడ్ చేయడం శ్రేయస్ అయ్యర్ గొప్పతనం అని ప్రశంసించారు. టీమిండియాలో అద్భుతమైన టాలెంట్ ఉందని వివరించారు. అందుకే శ్రేయస్ అయ్యర్ లాంటి ఆణిముత్యాలు తెరపైకి వస్తున్నారని గుల్బదిన్ నైబ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో టీమిండియాతో మరిన్ని మ్యాచ్లు తాము ఆడతామని కూడా వెల్లడించారు. ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య ఇవాళ చిట్ట చివరి టి20 జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. సోనీ స్పోర్ట్స్ ఛానల్ అలాగే ఫ్యాన్ కోడ్ లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా సిరీస్ తిలకించవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా కనుక విజయం సాధిస్తే…3-0 తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టును వైట్ వాష్ చేయనుంది.