Actress Sneha in KAAKA: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి (Bobby kolli) దర్శకత్వంలో రాబోతున్న చిత్రం కాకా(Kaaka ). ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో.. మళ్లీ ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో భాగం కాబోతున్న భారీ తారాగణం కూడా సినిమాపై అంచనాలు పెంచుతోంది. యాక్షన్ డ్రామా థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియమణి (Priyamani) లీడ్ రోల్ పోషిస్తుండగా.. అనస్వర రాజన్ (Anaswara Rajan) చిరంజీవి కూతురిగా నటిస్తున్నట్లు ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ.. స్పెషల్ విషెస్ తెలియజేసిన విషయం తెలిసింది.
అయితే ఇప్పుడు ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ స్నేహ (Sneha ) కూడా నటిస్తోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా సరే ఆమె ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటల తాలూకా వీడియోలను షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. ఇక నిజంగానే స్నేహ చిరంజీవి కాకా సినిమాలో నటిస్తోందా? ఏ పాత్రలో నటిస్తోంది అంటూ తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆసక్తి కలబరుస్తున్నారు. అంతేకాదు స్నేహ చెప్పిన ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ మూవీకి సంబంధించింది? అనే విషయాలపై ఆరా తీయగా అసలు నిజం బయటపడింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో.. దాదాపు ఏడేళ్ల క్రితం నాటిది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో స్నేహ మాట్లాడిన మాటలివి.” చిరంజీవి గారు చాలా గొప్ప వ్యక్తి . మంచి హ్యూమన్ బీయింగ్ . అలాంటి ఆయన చిత్రంలో నటించాలని ఎన్నో ఏళ్లుగా కలలు కన్నాను. కానీ ఆ కోరిక నెరవేరలేదు. ఇప్పుడు ఆయన వారసుడు రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రంలో నటిస్తున్నాను. ఆ కోరిక ఈ విధంగా తీరింది” అంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది స్నేహ . ఇందుకు సంబంధించిన వీడియో ని ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్నేహ చిరంజీవి నటిస్తున్న కాకా సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది అంటూ తెగ వైరల్ చేస్తున్నారు. మొత్తానికైతే స్నేహ కాకా సినిమాలో నటించడం లేదు. వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్లను ఇప్పుడు మళ్లీ వైరల్ చేస్తున్నారే తప్పా.. ఇందులో ఎలాంటి నిజం లేదు అని చెప్పవచ్చు. మొత్తానికైతే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పాలి..
ALSO READ: హీటెక్కించిన కెప్టెన్సీ రేస్.. భయం పుట్టిస్తున్న ఆటలు!
స్నేహ విషయానికి వస్తే.. చివరిగా విజయ్ దళపతి హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ది గోట్ చిత్రంలో నటించింది. అప్పటి నుండి ఆమె రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరించడం లాంటివి చేస్తుంది కానీ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. మరి తన నెక్స్ట్ సినిమా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి. కాని ఆమె వికీపీడియా ప్రకారం నయనతార, సుందర్ సి కాంబినేషన్లో వస్తున్న మూకుత్తి అమ్మన్ మూవీ సీక్వెల్ మహాశక్తి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.