Tanveer Ahmed on Sanju Samson: టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య ప్రస్తుతం మూడు టి20 లో సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లలో వరుసగా విజయం సాధించిన టీమిండియా…2-0 తేడాతో సిరీస్ కూడా కైవసం చేసుకుంది. అయితే నిన్న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టి20లో సంజు శాంసన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. 22 బంతుల్లో 57 పరుగులు చేసి ఇరగదీశాడు. దీంతో మ్యాచ్ అవలీలగా టీమిండియా గెలిచింది.
టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య నిన్న జరిగిన రెండో టి20 సందర్భంగా సంజు శాంసన్ బ్యాటింగ్ ఇరగదీసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్నటి మ్యాచ్ సందర్భంగా సంజు శాంసన్ తన బ్యాట్ లో చిప్స్ పెట్టాడని బాంబు పేల్చారు. అందుకే 22 బంతుల్లో 52 పరుగులు పూర్తి చేసుకున్నాడని సంజు బ్యాటింగ్ పై అనుమానం వ్యక్తం చేశారు తన్వీర్ అహ్మద్. నాలుగు సిక్సర్లతో పాటు ఏడు బౌండరీలు సంజు అవలీలగా కొట్టినప్పుడు.. తనకు ఈ విషయం అర్థమైందని ఆరోపణలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా కూడా సంజు శాంసన్ ఇలాగే కుట్రలకు తెరలేపి బ్యాటింగ్ చేశాడని ఫైర్ అయ్యారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో జరిగిన కీలక మ్యాచ్ లలో సంజు శాంసన్ బాగా ఆడిన విషయాన్ని గుర్తు చేశారు తన్వీర్ అహ్మద్.
ఆ సందర్భంగా తన బ్యాట్ లో AI ( AI Chips) అమర్చారని.. ఈ కుట్ర చేసింది భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అంటూ వ్యాఖ్యానించారు. AI చిప్స్ పెట్టడం వల్లే.. అప్పటివరకు ఫామ్ లో లేని సంజు, సిక్సర్లు, బౌండరీలు అవలీలగా బాదాడని ఆరోపణలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ పూర్తయి దాదాపు ఆరు నెలలు కావస్తోందని.. ఈ సమయంలో సంజు శాంసన్ వరుసగా విఫలమైన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ క్రమంలో అతన్ని టీమిండియా నుంచి తొలగించాల్సి వస్తుందని.. మళ్లీ బ్యాట్ లో చిప్స్ వాడారని తన్వీర్ అహ్మద్ పొంతన లేని వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటనపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీమిండియా జట్టు ( Team India) ఇలాగే వరుసగా ట్రోఫీలు గెలుచుకుంటూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే Tanveer Ahmed on Sanju Samson over Afghanistan vs India