Nibraz Ramzan Reaction IND ON AFG: టీమ్ ఇండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ (IND VS AFG) మధ్య ప్రస్తుతం 3 టీ20ల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టీ20 సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది టీమిండియా. ఈ విజయంతో 2-0 తేడాతో టి20 సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. అయితే ఆఫ్గనిస్తాన్ ఈ సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో శ్రీలంకకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ నిబ్రాజ్ రంజాన్ (Nibraz Ramzan) వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. ఐపీఎల్ లో కాంట్రాక్టులు రద్దు అవుతాయనే భయంతో టీమిండియా చేతిలో కావాలనే ఆఫ్గనిస్తాన్ అవ్వాలనే ఓడిపోయిందని హాట్ కామెంట్స్ చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 3 T20 ల సిరీస్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరుగుతోంది. ఈ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా… టైటిల్ ఎగరేసుకు పోయింది. అయితే ఈ సిరీస్ గెలిచిన టీమిండియా పై శ్రీలంకకు చెందిన ప్రముఖ జర్నలిస్టు నిబ్రాజ్ రంజాన్ (Nibraz Ramzan) హాట్ చేశారు. బీసీసీఐకి భయపడి ఆఫ్ఘనిస్తాన్ కావాలని ఓడిపోయిందని వివాదాస్పద కామెంట్స్ చేశారు. టీమిండియా పై (Team India) జయం సాధిస్తే వచ్చే ఐపీఎల్ లో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లకు ఛాన్స్ రాబోదనే భయంతో ఓడిపోయారని ఆరోపణలు చేశారు. టీమిండియా చేతిలో ఓడిపోవాలని బీసీసీఐ కూడా… ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుపై (Afghanistan Cricket Board) ఒత్తిడి తీసుకు వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇప్పటికే పాకిస్తాన్ తో ఆఫ్గనిస్తాన్ తెగ దెంపులు చేసుకుందని… మళ్లీ ఇండియాతో శత్రుత్వం పెట్టుకుంటే, క్రికెట్ ఆడకుండా అయిపోతుందని భయంతో ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డ్.. బీసీసీఐ తలవంచిందని బాంబు పేల్చారు. అటు వచ్చే ఐపిఎల్ లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ఆడాలంటే.. టీమిండియా చేతిలో వైట్ వాష్ కావాలని బీసీసీఐ (BCCI) ఒత్తిడి తెచ్చినట్లు కూడా ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ (Afg) చిత్తుగా రెండింటిలో ఓడిపోయిందని తెలిపారు. రేపు జరిగే మూడో టి20 లో కూడా ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడిపోవడం గ్యారంటీ అంటూ వివాదాస్పదం స్టేట్మెంట్ ఇచ్చారు. టీమిండియాను అవలీలగా ఐర్లాండ్ క్లీన్ స్వీప్ చేసినప్పుడు… ఆఫ్ఘనిస్తాన్ వల్ల ఎందుకు కావడం లేదంటూ ప్రశ్నించారు. దీని వెనుక బీసీసీఐ (BCCI) కుట్రలకు తెరలేదుతోందని… అందుకే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు నిబ్రాజ్ రంజాన్ (Nibraz Ramzan). అయితే నిబ్రాజ్ రంజాన్ (Nibraz Ramzan) చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.