Metro Parking: ప్రయాణికుల అవసరాలు కోసం పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నది మెట్రో లక్ష్యం. 2018లో తొలిసారి మెట్రో పార్కింగ్‌కు బిడ్డింగ్ జరిగింది. ఎంతమంది బిడ్లు వేశారో తెలియదు కానీ… జృతి సొల్యూషన్స్ అనే సంస్థకు ఉచితంగా లీజుకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు అప్పటి మెట్రో రైల్ ఎండీ NVS రెడ్డి. జృతి సొల్యూషన్స్‌లో రమణారెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. పార్కింగ్ లైసెన్స్ ఉచితంగా తీసుకున్నా… ప్రయాణికుల నుంచి ఫీజులు మాత్రం వసూలు చేశారు. 2021లో మరోసారి పార్కింగ్ స్థలాలు, ఓపెన్ ల్యాండ్స్‌కు సంబంధించి బిడ్డింగ్ జరిగింది. ఈసారి కూడా ఎంతమంది బిడ్స్ వేశారో తెలియదు. కానీ జృతి సొల్యూషన్స్, జ్రెని సొల్యూషన్స్ సంస్థలకే లీజు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు NVS రెడ్డి. జృతి సొల్యూషన్స్‌లో ఎండీగా ఉన్న రమణారెడ్డే, జ్రెనీ సొల్యూషన్స్ డైరెక్టర్లలోనూ ఉన్నాడు.
రూ.27 లక్షలకే 55 మెట్రో స్టేషన్లు..
2018లో మొత్తం స్టేషన్లకు సంబంధించి ఫ్రీగా లీజు దక్కించుకున్నాడు రమణారెడ్డి. 2021లో 33 స్టేషన్లు, 15 నుంచి 20 ఓపెన్ ల్యాండ్స్‌కు సంబంధిచి మొత్తం 17 లక్షల రూపాయలకు ఒక లీజు దక్కించుకున్నాడు. ఇందులో అమీర్‌పేట నుంచి ఎల్‌బీ నగర్ వరకు 16 స్టేషన్లు, అమీర్‌పేట నుంచి రాయ్‌దుర్గం వరకు 9 స్టేషన్లు, జేబీఎస్ నుంచి ఎంజీబిఎస్ వరకు మరో 9 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో అమీర్‌పేట కామన్ కాబట్టి మొత్తం 33 స్టేషన్లు. మరో లీజులో మియాపూర్ నుంచి నాగోల్ వరకు 22 స్టేషన్లకు సంబంధించిన పార్కింగ్ స్థలాల లీజును 10 లక్షల రూపాయలకు దక్కించుకున్నాడు. అంటే 55 స్టేషన్లు, ఓపెన్ ల్యాండ్స్ అన్నింటికి కలిపి ఏడాదికి 27 లక్షల రూపాయలు కట్టేలా నిర్ణయం జరిగింది. తర్వాత రెండేళ్ల పాటు లైసెన్స్ ఫీజును 5 శాతం పెంచేలా లీజు అగ్రిమెంట్‌లో ఉంది. అనంతరం అదే ఫీజు… లీజు పూర్తయ్యేవరకు కొనసాగుతుంది. ఈ లీజు కూడా 20 ఏళ్ల వరకు కొనసాగేలా, తర్వాత మరో 20 సంవత్సరాలు పొడిగించుకునేలా అగ్రిమెంట్ ఉంది.
Also Read: కవితను చూస్తే పాపం అనిపిస్తోంది.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్
55 మెట్రో స్టేషన్లపై సంచలన లెక్కలు!
ఏడాదికి 33 లక్షలు అంటే… నెలకి 3 లక్షల రూపాయల లోపు లైసెన్స్ ఫీజుతో 55 స్టేషన్ల పార్కింగ్ స్థలాల్ని, ఓపెన్ ల్యాండ్స్‌ను రమణారెడ్డికి కట్టబెట్టారు. ఇక్కడ పార్కింగ్ ఆదాయమే రోజుకు 3 లక్షల రూపాయల పైన వస్తోంది. ఇక ఓపెన్ ల్యాండ్స్‌లో ఫుడ్‌కోర్టులు, షాపులు ఇష్టానుసారంగా కట్టి లీజులకు ఇస్తున్నారు. వీటిమీద రోజుకు మరో 7 లక్షల పైనే సంపాదిస్తున్నారు. ఓవరాల్‌గా రోజుకు 10 లక్షలు… అంటే నెలకి 3 కోట్ల రూపాయల పైనే లాభం. సంవత్సరానికి ఇది 36 కోట్ల పైమాటే. ఐదేళ్లలో ఈ లెక్క దాదాపు 200 కోట్లు. అంటే 20 ఏళ్ల లీజు టైమ్‌లో వెయ్యి కోట్లకు పైనే కొల్లగొడుతున్నారు. మరో 20 ఏళ్లు అదనంగా పొడిగించుకునే అవకాశం. ఈ లోపు పార్కింగ్ ఫీజులు పెరుగుతాయి. షాపుల లీజుల లెక్కే మారిపోతుంది. అంటే మెట్రో పార్కింగ్‌లో సైలెంట్‌గా వేల కోట్ల స్కామ్ నడుస్తోంది.
తెర వెనుక ఆ ‘మెట్రో పెద్దమనిషి’ ఎవరు?
అసలు ఈ మొత్తం వ్యవస్థని ప్రభుత్వమే సరిగ్గా నిర్వహిస్తే… ఇంతకు మించిన ఆదాయం ప్రభుత్వానికే వస్తుంది. ఎందుకంటే మెట్రో నష్టాల్లో ఉంది. ప్రభుత్వానికీ, మెట్రో కట్టిన ఎల్ అండ్ టీకి నష్టాలు మిగులుతున్నాయి. కానీ పార్కింగ్ లీజుకు తీసుకున్న ప్రైవేట్ వ్యక్తి మాత్రం వేల కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ మొత్తం స్కామ్‌లో తెర ముందు రమణారెడ్డి కనిపిస్తున్నాడు. అయితే ఇంత చవగ్గా, చిల్లర పైసలకు లీజులు కట్టబెట్టడం వెనకున్న మెట్రో పెద్దమనిషి ఎవరు? మెట్రో ఎండీగా ఉన్న ఎన్‌వీఎస్ రెడ్డికి ఏమీ తెలియకుండానే లీజు అగ్రిమెంట్‌పై సంతకం పెట్టారా? అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిందా?