BigTV English
Advertisement

Hanuma Vihari show Cause Notice: అందుకేనా నోటీసు.. నెక్ట్స్ ఏంటి..?

Hanuma Vihari show Cause Notice: అందుకేనా నోటీసు.. నెక్ట్స్ ఏంటి..?
Hanuma Vihari served show cause notice by the Andhra Cricket Association
Hanuma Vihari served show cause notice by the Andhra Cricket Association

Show Cause Notice to AP Cricket Player Hanuma Vihari: టీమిండియా టెస్టు క్రికెటర్ హనుమవిహారికి నోటీసులు జారీ చేసింది ఏపీ క్రికెట్ సంఘం. క్రికెట్‌లో తనకు జరిగిన అన్యాయంపై ఆయన నోరు విప్పాడు. దీనిపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై సమావేశమైన అపెక్స్ కౌన్సిల్ ఈనెల 25న మెయిల్ ద్వారా నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.


అసలేం జరిగిందంటే.. ఫిబ్రవరి 26న మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు ఓటమి పాలైంది. రాజకీయ నేతల జోక్యం కారణంగా తనను జట్టు కెప్టెన్ నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తంచేశాడు హనుమ విహారి. అంతేకాదు మరోసారి తాను ఆంధ్ర జట్టుకు ఆడనంటూ ఇన్‌స్టాలో పోస్టు సంచలనంగా మారింది. ముఖ్యంగా జట్టులోని 17వ ఆటగాడిపై గట్టిగా కేకలు వేశాడు. ఆ ప్లేయర్ ఫాదర్ రాజకీయ నేతకు చెందిన వ్యక్తి. ఈ క్రమంలో ఏసీఏపై ఒత్తిడి తెచ్చి తనపై వేటు వేయించాడని అందులో ఆరోపించాడు హనుమ విహారి. అంతేకాదు తనకు మద్దతుగా నిలిచిన ఆటగాళ్లు సంతకాలతో కూడిన లేఖను కూడా పోస్టు చేశాడు. ఈ వ్యవహారంపై రియాక్టయిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నోటీసులు ఇచ్చింది.

హనుమ సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్లు ఆంధ్రా క్రికెట్ సంఘానికి చెందిన ఓ ప్రతినిధి చెప్పారు. గత నెలలో ఆయన ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడో తెలుసుకోవాలని అనుకున్నట్లు తెలిపారు. దేశవాళీ క్రికెట్‌లో హనుమ విహారి పోషించిన రోల్ గురించి తమకు తెలుసని ఏసీఏ ప్రతినిధి తెలిపారు.


Also Read: Rohit Sharma – Akash Ambani : రోహిత్ తో మాట్లాడిన ఆకాశ్ అంబానీ…

మరోవైపు అసోసియేషన్ నోటీసుకు తాను బదులిచ్చానని చెప్పుకొచ్చాడు విహారి. తనకు అన్యాయం జరిగిందన్నాడు. రాష్ట్ర తరపున ఆడేందుకు ఎన్ఓసీ అడిగానని అతడు తెలిపాడు. ఏసీఏ స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించాడు.

Tags

Related News

Rohit Sharma: Uber టాక్సీలో రోహిత్ శర్మ.. వీడియో వైరల్

IPL 2026: ఐపీఎల్ లో సంచ‌ల‌నం… ఢిల్లీకి సంజూ.. రాజస్థాన్‌కు స్టబ్స్?

Usman Tariq bowling action: ఎంతకు తెగించార్రా.. త్రో బౌలింగ్ వేసి, ద‌క్షిణాఫ్రికాను ఓడించిన పాక్ బౌల‌ర్ ?

Kane Williamson Retirement: రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన కేన్ మామ‌..ఇక అత‌ని శ‌కం ముగిసింది

Ind vs Aus: నేడే ఆస్ట్రేలియాతో చివ‌రి టీ20..అర్ష‌దీప్ ను తీసుకోక‌పోతే, గంభీర్ కు దండేసి, దండం పెట్ట‌డ‌మే

Ind vs SA, Final: నేడే ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య‌ ఫైన‌ల్స్..వ‌ర్షం గండం, మ్యాచ్ ర‌ద్దు అయితే విజేత ఎవ‌రంటే?

Gautam Gambhir: ఓరేయ్ గంభీరా…ఏంట్రా ఇది, గ‌ల్లీ పోర‌గాళ్ల ఆట కంటే దారుణం…?

Washington Sundar: ఒకేసారి ఇద్దరితో డేటింగ్ చేస్తున్న వాషింగ్టన్ సుందర్ ?

Big Stories

×