Viral Video: ఢిల్లీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చివరకు యమనా నది వద్ద నీటి ప్రవాహం తారాస్థాయికి చేరింది. వర్షాల కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీకావు.
రెండు రోజుల కిందట గురుగ్రామ్‌లో రెండు గంటల పాటు వర్షం దంచికొట్టింది. దీని ఫలితంగా జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 7 కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచిపోయాయి. కేవలం రెండు కిలోమీటర్ల ప్రయాణించేందుకు నాలుగైదు గంటలు పట్టింది.
ఈ విషయాన్ని వాహనదారులు స్వయంగా చెప్పారు కూడా. పరిస్థితి గమనించిన ఓ టూ వీలర్స్ వాహనదారుడు, కొత్త ప్లాన్ చేశారు. ట్రాఫిక్‌లో ఇరుక్కుని గంటల తరబడి వేచిన ఆ యువకుడు, చివరకు బైక్‌ను నెత్తి మీదు పెట్టుకుని మోసుకుంటూ వెళ్లిపోయాడు.
ఈ తతంగాన్ని ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఓ వాహనదారుడు షూట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీనికి నెట్టింట్లో మాంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు గిరగిరా తెగ తిరిగేస్తోంది. ఇప్పుడు ఆ వీడియోపై ఓ లుక్కేద్దాం.
In Gurgaon, a man carried his scooter on his shoulder to avoid traffic 😭 pic.twitter.com/HQdXpQ6leC
— Aaraynsh (@aaraynsh) September 3, 2025