BigTV English

CSK: శ్రీనివాసన్ చేతిలోకి మళ్ళీ CSK… వచ్చే సీజన్ లో మ్యాచ్ ఫిక్సింగ్ గ్యారంటీ అంటూ ట్రోలింగ్?

CSK: శ్రీనివాసన్ చేతిలోకి మళ్ళీ CSK… వచ్చే సీజన్ లో మ్యాచ్ ఫిక్సింగ్ గ్యారంటీ అంటూ ట్రోలింగ్?
Advertisement

CSK : ఐపీఎల్ లో చెన్నైౌ సూపర్ కింగ్స్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీలను 5 సార్లు సాధించిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు మాత్రమే నిలిచాయి. మిగతా జట్లు అన్ని తక్కువకే పరిమితం అయ్యాయి. దాదాపు 10 సార్లు ఫైనల్ కి వెళ్లింది చెన్నై సూపర్ కింగ్స్. 5 సార్లు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. 2010, 2014లో రెండు సార్లు ఛాంపియన్స్ లీగ్ టీ20ని కూడా గెలుచుకుంది. ప్రస్తుతం  ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహిస్తున్నాడు. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ రుతురాజ్ గాయపడటంతో 2025 సీజన్ కి ధోనీనే కెప్టెన్ గా వ్యవహరించాడు. వాస్తవానికి చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ శ్రీనివాసనే. ఈ శ్రీనివాసన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.


Also Read : Heinrich Klaasen: నెలకొక టోర్నమెంట్… కాటేరమ్మ కొడుకు అంటే మామూలుగా ఉండదు… ప్రపంచంలోనే బిజీయస్ట్ క్రికెటర్

మ‌ళ్లీ మ్యాచ్ ఫిక్సింగ్ గ్యారెంటీ అంటూ

కానీ మధ్యలో 2016, 2017 సమయంలో చెన్నై పై వేటు పడింది. 2013 సంవత్సరంలో జరిగిన ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని రెండేళ్లపాటు.. చెన్నై పై బ్యాన్ పడింది… అప్పటి నుంచి చెన్నై జట్టుకు దూరంగా ఉంటున్నాడు శ్రీనివాసన్. అయితే వచ్చే సీజన్ నుంచి మళ్ళీ అందుబాటులోకి.. రావడమే కాకుండా చైర్మన్ బాధ్యతలు తీసుకోబోతున్నాడట. అదే జరిగితే మళ్లీ ఫిక్సింగ్ తెరపైకి వస్తుందని కౌంటర్ ఇస్తున్నారు ఐపీఎల్ అభిమానులు. ప్రస్తుతం శ్రీనివాసన్ దూరంగా ఉంటున్న విషయం విధితమే. 2026 సీజన్ కి కూడా చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తే.. CSK పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేయడం పక్కా అని చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఆర్సీబీ, సీఎస్కే అభిమానుల మధ్య రచ్చ జరుగుతుంది. శ్రీనివాసన్ చైర్మన్ అయితే ఆ రచ్చను మరింత రచ్చగా చేసే అవకాశాలు అయితే లేకపోలేదు.


చెన్నై సూపర్ కింగ్స్ కి గుడ్ న్యూస్

చెన్నై సూపర్ కింగ్స్ కి ఎన్ శ్రీనివాసన్ తిరిగి చైర్మన్ గా నియమితులైతే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే..? 2025లో ధోనీ కెప్టెన్సీ లో ఈ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. అయితే ఇతను రాకతో కాస్త బూస్ట్ ఇవ్వనుంది. శ్రీనివాసన్ కి క్రికెట్ లో మంచి అనుభవం ఉంది. అతని అనుభవం ఇప్పుడు సీఎస్కే జట్టు పుంజుకునేలా చేయనుంది. గత ఏడాది శ్రీనివాసన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు జట్టు డైరెక్టర్ల బోర్డు నుంచి తాత్కాలికంగా వైదొలిగారు. ఇక ఆ తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీనివాసన్ తో పాటు అతని కుమార్తె రూపా గురునాథ్ తిరిగి డైరెక్టర్లుగా నియమకం అయ్యారు. 2011లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసన్..ప్రపంచ క్రికెట్ లో ప్రతిభవంతుల్లో ఒకరిగా నిలిచాడు. అదే ఏడాది టీమిండియా వన్డే వరల్డ్ కప్ కూడా సాధించడం విశేషం. 2013లో ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా వైదొలిగాడు.

Tags

Related News

Womens World Cup 2025: నేడు శ్రీలంక‌, బంగ్లా మ‌ధ్య ఫైట్‌…టీమిండియా సెమీస్ చేరాలంటే ఇలా జ‌రుగాల్సిందే?

INDW VS ENGW: స్టేడియంలో ఎక్కి ఎక్కి ఏడ్చిన‌ స్మృతి మందాన..ఫోటోలు వైర‌ల్‌

Ban On Pakistan: అఫ్ఘ‌నిస్తాన్ దెబ్బ అద‌ర్స్‌.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాకిస్తాన్ ఔట్ ?

Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండ‌టం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే ప‌నులు ?

INDW vs ENGW: స్మృతి , హర్మన్ పోరాటం వృధా…సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్..టీమిండియాకు ఇంకా ఛాన్స్‌

Mitchell Starc: 176.5 కిమీ వేగంతో స్టార్క్ బౌలింగ్‌..షోయ‌బ్ అక్త‌ర్ 22 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు

IND VS AUS: టీమిండియా కొంప‌ముంచిన వ‌రుణుడు..పెర్త్ లో ఆసీస్ విక్ట‌రీ

Smriti Mandhana Wedding: పెళ్లి చేసుకోబోతున్న లేడీ కోహ్లీ…వ‌రుడు ఎవ‌రో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Big Stories

×