Amit Mishra Retirement : సాధారణంగా క్రికెటర్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా రిటైర్మెంట్ అవుతున్నారు. ఇటీవలే అశ్విని రిటైర్మెంట్ మరిచిపోకముందే తాజాగా అమిత్ మిశ్రా క్రికెట్ కి గుడ్ బై చెప్పారు. టీమిండియా సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అవుతున్నట్టు తాజాగా ప్రకటించాడు. తన కెరీర్ లో 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ 20 మ్యాచ్ ల్లోటీమిండియా తరపున ఆడాడు. 2017లోనే అమిత్ మిశ్రా టీమిండియా కి దూరం అయ్యాడు. కానీ అతను గత ఏడాది ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కి ప్రాతినిధ్యం వహించాడు. అమిత్ మిశ్రా ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా గాయాల బెడద, యువ ఆటగాళ్లకు అవకాశాలు రావాలనే ఉద్దేశంతోనే 42 ఏళ్ల వయస్సులో తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్ కి గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించేశాడు. ఐపీఎల్ లో 3 హ్యాట్రిక్ తీసిన బౌలర్ గా కూడా అమిత్ మిశ్రా రికార్డు సృష్టించాడు.
Also Read : CSK: శ్రీనివాసన్ చేతిలోకి మళ్ళీ CSK… వచ్చే సీజన్ లో మ్యాచ్ ఫిక్సింగ్ గ్యారంటీ అంటూ ట్రోలింగ్?
“నా జీవితంలో 25 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడాను. ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. బీసీసీఐ, హర్యానా క్రికెట్ అసోసియేషన్ కి, నా సహాయక సిబ్బంది, నా సహచర ఆటగాళ్లకు, నా కుటుంబ సభ్యులకు ఎంతో రుణపడి ఉన్నాను. అందరికంటే ముఖ్యంగా నాకు ఎల్లవేళలా అండగా నిలబడిన అభిమానులకు ధన్యవాదాలు. నా ప్రయాణానికి తీపి జ్ఞాపకంగా మార్చి మీరే. క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. ఎన్నో పాఠాలను నేర్పించింది. మైదానంలో నాకు ఉన్న జ్ఞాపకాలు పదిలమే. జీవితంలో నాకు లభించిన ఈ గొప్ప నిధిని కాపాడుకుంటాను” అని అమిత్ మిశ్రా ప్రకటించాడు.
ముఖ్యంగా 2008లో ఆస్ట్రేలియాలోని మొహలీలో ఓ మ్యాచ్ సందర్భంగా అడుగుపెట్టాడు అమిత్ మిశ్రా. తొలి మ్యాచ్ లోనే 5 వికెట్లు తీయడంతో అత్యుత్తమ బౌలర్ల సరసన చేరాడు. 2013 జింబాబ్వేతో 5 మ్యాచ్ ల సిరీస్ లో మొత్తం 18 వికెట్లు తీసిన ఈ లెగ్ స్పిన్నర్.. ద్వైపాక్షిక సిరీస్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన శ్రీనాథ్ పేరిట ఉన్న రికార్డును సమానం చేసాడు. అలాగే టీ-20 వరల్డ్ కప్ 2014 టోర్నీలో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన టోర్నీలో 10 వికెట్లు తీశాడు. టీమిండియా రన్నరప్ గా నిలిచింది. 2017 తరువాత మిశ్రా కి చోటు కరువు అయింది. దేశీయ క్రికెట్, ఐపీఎల్ కి మాత్రమే పరిమితం అయ్యాడు. మరోవైపు ఐపీఎల్ లో అత్యధికంగా మూడుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా అమిత్ మిశ్రా చిరస్మరణీయ రికార్డు సాధించాడు. 2008లో ఢిల్లీ డేర్ డేవిల్స్, 2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 2013లో అమిత్ మిశ్రా సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున హ్యాట్రిక్ వికెట్లను తీశాడు. టీమిండియా లో కీలక బౌలర్ గా రాణించారు. మరోవైపు క్యాష్ రిచ్ లీగ్ లో మొత్తం 162 మ్యాచ్ లు ఆడితే 174 వికెట్లను తీసి సత్తా చాటాడు మిశ్రా.