BigTV English

Vishwak Sen Birthday Special: విశ్వక్‌సేన్‌ బర్త్‌ డే స్పెషల్‌.. ఈ రోజు రాబోతున్న కొత్త సినిమా అప్డేట్లు ఇవే..!

Vishwak Sen Birthday Special: విశ్వక్‌సేన్‌ బర్త్‌ డే స్పెషల్‌.. ఈ రోజు రాబోతున్న కొత్త సినిమా అప్డేట్లు ఇవే..!
Vishwak Sen
Vishwak Sen Birthday Special Story

Vishwak Sen Birthday Special: డిఫరెంట్ కాన్సెప్టులను ఎంచుకుంటూ.. హిట్, ఫ్లాపులతో సంబంధంలేకుండా దూసుకుపోతున్న హీరోల్లో టాలీవుడ్ టాలెండ్ నటుడు విశ్వక్ సేన్ ఒకడు. తన సినిమా సినిమాకు కొత్తదనాన్ని కోరుకుంటాడు విశ్వక్ సేన్. అయితే నేడు ఈ హీరో బర్త్ డే ఈ సందర్భంగా తాను చేస్తున్న.. చేయబోతున్న సినిమాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.


‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన విశ్వక్.. ఇందులో డిఫరెంట్‌గా కనిపించి ఎంతోమంది ప్రేక్షకులను అలరించాడు. ఇక ఆ తర్వాత ‘ఫలక్‌నుమా దాస్’తో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ మూవీలో తన యాక్టింగ్, వాయిస్‌తో ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నాడు.

ఈ చిత్రంతోనే విశ్వక్.. మాస్ కా దాస్‌గా పేరు సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి తిరిగి వెనక్కి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దుసుకుపోతున్నాడు. అయితే ఇటీవల రిలీజ్ అయిన గామితో మరింత పాపులర్ దక్కించుకున్నాడు. ఇందులో అఘోరగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు.


Also Read: ‘టిల్లు స్క్వేర్’ ట్విట్టర్ రివ్యూ.. 3/5 రేటింగ్.. కానీ అదొక్కటే

అయితే ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. కాగా నేడు విశ్వక్ బర్త్ డే కావడంతో మరికొన్ని కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్ల కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవేంటో చూసేద్దాం..

విశ్వక్ సేన్ తన కెరీర్‌లో ‘VS 10’ వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజు లాంఛ్ చేయబోతున్నారు. కాగా ఈ చిత్రానికి రవి తేజ ముల్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో విశ్వక్ మాస్ అవతార్‌లో ఐరన్ రాడ్‌ను భుజంపై వేసుకుని కనిపిస్తున్నాడు.

Also Read: పెళ్లి కాదంట.. ఫోటో రిలీజ్ చేసిన సిద్దార్థ్- అదితి

దీంతోపాటు విశ్వక్ తన కెరీర్‌లో 11వ చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నేహాశెట్టి, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అలాగే ‘VS12’కు సంబంధించిన అప్డేట్‌ను కూడా మేకర్స్ షేర్ చేశారు. ఈ చిత్రాన్ని ‘భగవంత్ కేసరి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని అందించిన షైన్ స్క్రీన్ బ్యానర్‌ నిర్మించనుంది. కాగా ఈ మూవీలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని తాను గామి మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో తెలియజేసిన విషయం తెలిసిందే. కొత్త డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

Related News

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Big Stories

×