MS Dhoni-GST: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ( Mahendra Singh Dhoni ) కేంద్ర సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో రకరకలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా కేంద్రం లోని మోడీ సర్కార్ జీఎస్టీ శ్లాబుల్లో ( GST Council Meeting Highlights ) పెను మార్పులు చేసింది. 12 శాతం అలాగే 5 శాతం శ్లాబులు మాత్రమే అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. లగ్జరీ వస్తువులపై మాత్రం 40 శాతం జీఎస్టీ అమలు చేయనుంది. అంటే ఈ లిస్టులోకి పొగాకు, హుక్కా లాంటివి వస్తాయి. వాస్తవంగా మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) తరచూ హుక్కా ( hookah) కొడతారన్న సంగతి తెలిసిందే. గతంలో కూడా మహేంద్రసింగ్ ధోని హుక్కా కొడుతూ.. కనిపించాడు. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. అయితే ఇప్పుడు హుక్కాను… 40% జిఎస్టి శ్లాబు లోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ లెక్క ప్రకారం మహేంద్ర సింగ్ ధోనీకి మోడీ ప్రభుత్వం ( Modi Governament) షాక్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం… తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ స్లాబ్ లో పెను మార్పులు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. సామాన్యులకు ఊరట కల్పిస్తూ… 12 శాతం అలాగే ఐదు శాతం స్లాబులను కొనసాగిస్తోంది. చాలా వస్తువుల జీఎస్టీని.. కింది స్థాయికి తీసుకువచ్చింది. దీంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు కూడా ఊపు అందుకున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈ కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయి.
అయితే ఇలాంటి నేపథ్యంలో లగ్జరీ వస్తువుల పైన కేంద్ర ప్రభుత్వం… కఠినంగా వ్యవహరిస్తోంది. పొగాకు, ఎనర్జీ డ్రింక్స్ అలాగే హుక్కా లాంటి వాటిపై 40 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అయితే 40 శాతం హుక్కా పై జిఎస్టి విధిస్తే చెన్నై ప్లేయర్లు పర్సనల్ లోన్, ఇతర అప్పులు చేయాల్సి వస్తుందని ఈ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరైతే హుక్కా తనతో తాగిస్తారో వాళ్లకు మాత్రమే మహేంద్రసింగ్ ధోని చెన్నై జట్టులో ఛాన్స్ ఇస్తారని.. సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతోంది. టీమిండియా కెప్టెన్ గా ఉన్న సమయంలో కూడా ధోని ఇలాగే చేశాడని ఇర్ఫాన్ పఠాన్ ఇటీవల పేర్కొన్నారు. దీంతో ధోనికి హుక్కా ఏర్పాటు చేయాలని.. చెన్నై ప్లేయర్లు ఆలోచన చేస్తున్నట్లు ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో 40 శాతం దీనిపై జిఎస్టి అమలు చేయడం.. చెన్నై ప్లేయర్లకు పెద్ద దెబ్బ అని చర్చ జరుగుతోంది. దీంతో వాళ్లు అప్పుల పాలు కావడం గ్యారంటీ అంటున్నారు.
మహేంద్ర సింగ్ ధోనిపై ఇర్ఫాన్ పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధోని వల్లే తనకు టీమిండియాలో అవకాశం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుక్కా ఇచ్చిన వాళ్లకు మాత్రమే ధోని జట్టులో అవకాశం కల్పించాలని బాంబు పేల్చారు. తాను హుక్కా ఏర్పాటు చేయకపోవడంతోనే తనపై వేటు వేశాడని మండిపడ్డారు.
40% gst on hookah. Csk youngsters applying for personal loan 😭 pic.twitter.com/tTD6mcNhDx
— babu bisleri (@baabuOP) September 3, 2025