IPL tickets-GST : సాధారణంగా ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు క్రికెట్ ని వీక్షించేందుకు దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తుంటారు. కానీ ఈ సారి అంతగా ఎవ్వరూ ఎదురు చూడరేమో అనిపిస్తోందట. అందుకు ఓ కారణం ఉందడోయ్. ఎందుకంటే ఐపీఎల్ కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టికెట్ రేట్లను ఒక్కసారిగా పెంచడంతో క్రికెట్ అభిమానులు షాక్ కి గురవుతున్నారు. టికెట్ రేట్లను భారీగా పెంచితే సినిమాలకు కూడా జనాలు తగ్గారు. ఇక నుంచి ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షించేందుకు కూడా ఎవ్వరూ ఆసక్తి చూపరని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సగటు ప్రేక్షకుడికి అందుబాటులో ఉండే ధరలకు టికెట్లను అమ్మితే అభిమానులు అధిక సంఖ్యలో వచ్చి మ్యాచ్ ని వీక్షిస్తారు. కానీ లాభాలను చూస్తే నష్టాలు మాత్రం తప్పడం లేదని చెప్పవచ్చు. ఐపీఎల్ టికెట్ రేట్లను పెంచడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ టికెట్ ధరలను ఇంతగా ఎందుకు పెంచారు. అసలు టికెట్ రేట్లను ఎవ్వరూ పెంచారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరా తీయడం విశేషం.
ముఖ్యంగా కొత్త GST పాలసీ ప్రకారం.. టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. ఐపీఎల్ చూడటం ఇకపై అభిమానుల జేబులకు చిల్లులు పడేలా కనిపిస్తోంది. వాస్తవానికి సెప్టెంబర్ 22, 2025 నుంచి అమలులోకి వచ్చిన కొత్త పాలసీ ప్రకారం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లకు, ఇతర ప్రీమియం స్పోర్ట్స్ ఈవెంట్ కి దాదాపు 40 శాతం GST విధించారు. గతంలో ఈ ధర 28 శాతం మాత్రమే ఉండేది. కానీ ఒక్కసారిగా 12 శాతం పెరిగే సరికి 40 శాతానికి చేరుకుంది. ఇక నుంచి ఐపీఎల్ టికెట్లు అత్యధిక ట్యాక్స్ లిస్ట్ లోకి చేరాయి. దీంతో రూ.1000 ఉన్నటికెట్ పై 28 శాతం పన్ను వేయడంతో మొత్తం ధర రూ.1280 కి చేరుకుంది. కొత్త రేటు ప్రకారం.. అదే టికెట్ పై 40 శాతం పన్ను పడుతుంది. దీంతో ఈ టికెట్ ధర నేరుగా రూ.1400 అవ్వనుంది. అంటే ప్రతీ రూ.1000 ఖర్చు పై అభిమానులు రూ.120 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
ఐపీఎల్ టికెట్ ధరలపై ప్రభావం ఈ విధంగా ఉండనుంది. రూ.500 టికెట్ రూ.700లకు చేరుకుంది. అయితే రూ.1000 టికెట్ ధర రూ.1400, రూ.2000 టికెట్ పై రూ.2800 పడనుంది. వాస్తవానికి పాత ధరలు రూ.500 టికెట్ పై 640, రూ.1000 టికెట్ పై 1280, 2000 టికెట్ పై 2560 ఉండేది. ఇప్పటికే పెరిగాయనుకుంటే.. మళ్లీ పెంచారని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు కొత్త జీఎస్టీ తో ఐపీఎల్ టికెట్ ధరలు పెరగడంతో క్యాసినోలు, రేస్ క్లబ్బులు, లగ్జరీ గూడ్స్ లిస్ట్ లో ఐపీఎల్ కూడా చేరిపోయింది. కాస్త సంతోషించ దగిన విషయం ఏంటంటే..? సాధారణ అంతర్జాతీయ లేదా దేశీయ క్రికెట్ మ్యాచ్ ల టికెట్ల పై జీఎస్టీ 18 శాతంగానే కొనసాగుతోంది. కొత్త జీఎస్టీ 40 శాతం రేటు ప్రత్యేకంగా ఐపీఎల్, ఇతర ఫ్రాంచైజీ లీగ్ లను ప్రభావితం చేస్తోంది.