BigTV English

NIRF Rankings 2025: NIRF ర్యాం‘కింగ్‌’లో ఐఐటీ చెన్నై.. ఐఐఎం అహ్మదాబాద్, తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలెక్కడ?

NIRF Rankings 2025: NIRF ర్యాం‘కింగ్‌’లో ఐఐటీ చెన్నై.. ఐఐఎం అహ్మదాబాద్, తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలెక్కడ?

NIRF Rankings 2025: దేశంలో టాప్ ఇనిస్టిట్యూట్ ర్యాకింగ్‌ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి ఐఐటీ చెనై, ఐఐఎం అహ్మదాబాద్. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్-NIRF-2025 విడుదల చేశారు. మద్రాస్ ఐఐటీ ఈసారి అగ్రస్థానం నిలబెట్టుకుంది.


ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, మెడిసిన్ ఇలా 17 విభాగాల్లో విశ్వవిద్యాలయాల పని తీరు ఆధారంగా సాధించిన ఫలితాల ఆధారంగా ర్యాంకింగ్ కేటాయించింది. మొదటి టాప్-100 స్థానాల్లో ఉన్నత విద్యాసంస్థలున్నాయి.  బోధన, బోధనేతర, స్టడీ, వనరులు, పరిశోధన, గ్రాడ్యుయేషన్ ఫలితాలు, ఇన్ క్లూజివిటీ, పర్ సెప్షన్ పారా మీటర్స్ ఆధారంగా ఈ ర్యాంకింగులు రూపొంచారు.

తొలిసారి ఈ ఏడాది కొత్తగా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌-SDG కేటగిరీని ప్రవేశపెట్టారు. కాలేజీలు, యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు కేంద్రమంత్రి.  ర్యాంకులు విడుదల చేసిన వాటిలో యూనివర్సిటీ, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, న్యాయశాస్త్రం, మెడిసిన్, ఆర్కిటెక్చర్, డెంటల్, ఇన్నోవేషన్, అగ్రికల్చర్ తోపాటు కాలేజీ ఉన్నాయి.


అలాగే సంబంధిత రంగాలకు చెందిన పరిశోధనా సంస్థలు, ఓపెన్ యూనివర్సిటీలు, స్కిల్ యూనివర్సిటీలు, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే విద్యాలయాలున్నాయి. దేశవ్యాప్తంగా 10,885 దరఖాస్తులు రాగా, వాటిని వడపోసిన ర్యాంకులను కేటాయించారు.

ALSO READ: పొంగిన యమునా నది.. ప్లైఓవర్ మధ్య భారీ హోల్

ఐఐటీల విషయానికొద్దాం. ఈ కేటగిరీలో ఐఐటీ మద్రాస్ మరోసారి టాప్ పొజిషనల్ లో నిలిచింది. బెంగుళూరు ఐఐఎస్సీ సెకండ్ ప్లేస్ కాగా, ఆ తర్వాత ముంబై ఐఐటీ నిలిచింది. ఢిల్లీ ఐఐటీ నాలుగో స్థానం, కాన్పూర్ ఐఐటీ ఐదో ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీ, రూర్కీ ఐఐటీ, ఢిల్లీ ఎయిమ్స్, ఢిల్లీ జేఎన్‌యూ, టాప్ -10లో బనారస్ హిందూ యూనివర్సిటీ ఉన్నాయి.

ఐఐఎంల విషయానికొద్దాం. ఐఐఎం అహ్మదాబాద్‌ అగ్రస్థానం దక్కించుకుంది. బెంగళూరు-ఐఐఎం, కోజికోడ్-ఐఐఎం, ఢిల్లీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లక్నో-ఐఐఎంలు తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి. ముంబై-ఐఐఎం ఆరో ప్లేస్ కాగా, కోల్‌కత-ఐఐఎం (ఏడు), ఇండోర్-ఐఐఎం(ఎనిమిది), గుర్గావ్‌లోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(తొమ్మిది), జంషెడ్‌పూర్‌ లోని జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పదో ప్లేస్ దక్కించుకుంది.

దేశంలో అత్యుత్తమ న్యాయ విశ్వవిద్యాలయంగా బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ తొలి స్థానం సొంతం చేసుకుంది. ఢిల్లీ-నేషనల్ లా యూనివర్సిటీ సెకండ్ ప్లేస్, హైదరాబాద్- నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా థర్డ్ ప్లేస్ లో నిలిచాయి. కోల్‌కత లోని ది వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సైన్సెస్ నాలుగు, గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ ఐదో స్థానంలో నిలిచాయి.

వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న యూనివర్శిటీల విషయానికి వద్దాం. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ సెకండ్ ప్లేస్ కాగా, చండీగఢ్-పంజాబ్ యూనివర్సిటీ థర్డ్ ప్లేస్‌లో నిలిచింది.

ఏపీలోని ఆంధ్ర యూనివర్సిటీ నాలుగు, కేరళలోని తిరువనంతపురం యూనివర్సిటీ ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నాయి. కొచ్చిన్-కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆరోప్లేస్ కాగా, తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ ఏడో స్థానంలో నిలిచింది. కాశ్మీర్ యూనివర్సిటీ- ఎనిమిది, గౌహతి యూనివర్సిటీ-తొమ్మిది, కోయంబత్తూర్ లోని భారతియార్ యూనివర్సిటీ టాప్ -10లో ఉంది.

Related News

Delhi: పొంగిన యమునా నది.. ఫ్లైఓవర్ మధ్య భారీ హోల్, ఆటోకు తప్పిన ప్రమాదం

Scholarship scheme: అదిరిపోయే స్కీమ్.. ఇంటర్ పాసైతే చాలు.. ఏడాదికి రూ.20వేలు పొందొచ్చు..

Onam Tragedy: హుషారుగా డ్యాన్స్.. ఒక్కసారిగా ఆగిన గుండె.. కళ్ళముందే కుప్పకూలిన అసెంబ్లీ ఉద్యోగి!

Solar Storm: భూమికి మరో ముప్పు.. ముంచుకోస్తున్న సౌర తుఫాన్..

India Post: బిగ్ షాకిచ్చిన పోస్టల్.. అక్కడికి అన్నీ బంద్.. వాట్ నెక్స్ట్!

Big Stories

×