BigTV English

Bigg Boss AgniPariksha: అగ్ని పరీక్ష అంటూ అవమానిస్తున్నారు.. బిగ్ బాస్‌పై సిద్దిపేట్ మోడల్ ఫైర్

Bigg Boss AgniPariksha: అగ్ని పరీక్ష అంటూ అవమానిస్తున్నారు.. బిగ్ బాస్‌పై సిద్దిపేట్ మోడల్ ఫైర్

Bigg Boss AgniPariksha: తెలుగు,తమిళ,కన్నడ, హిందీ భాషల్లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ అంటే తెలియని వారు ఉండరు. అయితే ఈ బిగ్ బాస్ షోపై ఇప్పటికే చాలాసార్లు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికి కూడా షో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు బిగ్ బాస్ మేకర్స్. ప్రస్తుతం తెలుగులో 8 సీజన్లు పూర్తయ్యాయి. త్వరలోనే 9 సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఈ 9వ సీజన్లో కామన్ మ్యాన్ ఎంట్రీ ఉంటుందని.. ఇప్పటికే ఎంపిక చేసి వారికి అగ్నిపరీక్ష పేరుతో ఒక స్పెషల్ షో కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ షోలో 45 మంది
కామనర్స్ ని సెలెక్ట్ చేసి వారికి కొన్ని టెస్టులు పెడుతూ అందులో క్వాలిఫై అయిన వారిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.


అగ్ని పరీక్ష ఒక ఫేక్..

ఇప్పటికే ఎంతోమంది కామనర్స్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు ఈ అగ్ని పరీక్ష కి వెళ్లారు. అందులో ఒకరే సిద్దిపేట మోడల్.. అయితే ఈ సిద్దిపేట మోడల్ కి బిగ్ బాస్ సీజన్ 9 లో కచ్చితంగా ఎంట్రీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆయనను కనీసం 5 నిమిషాలు కూడా స్క్రీన్ మీద చూపించలేదు. ఆయన రావడంతోనే యూ రిజెక్టెడ్..నువ్వు ఈ హౌస్ లో సెట్ కావు అంటూ జడ్జిలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే జడ్జెస్ రిజెక్ట్ చేయడంపై తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


సామాన్యులకు అన్యాయం జరుగుతోంది..

సిద్దిపేట మోడల్ బెజుగం వెంకటేష్ మాట్లాడుతూ.. “బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం ఫేక్..అక్కడ అగ్ని పరీక్ష పేరుతో కామనర్స్ ని తీసుకొని.. వాళ్లకు ఇష్టం ఉన్నవారిని మాత్రమే అందులో తీసుకుంటున్నారు. ఒకరకంగా ఇందులో గ్యాంబ్లింగ్ జరుగుతోంది. అలాగే డబ్బులు తీసుకొని షోకి సెలెక్ట్ చేస్తున్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది ఈ షో మీద దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. అవి చాలా అసభ్యంగా ఉన్నాయి. కనీసం చెప్పడానికి వీలు లేకుండా ఉన్నాయి.. నన్ను అసలు ఎలాంటి కారణం లేకుండానే రిజెక్ట్ చేశారు. కారణం కూడా చెప్పలేదు. షో చూసిన వాళ్ళకి అది బాగా తెలుస్తుంది.. ఇక నేనైనా రెండు నిమిషాలు కనిపించాను. కానీ కొంతమంది అయితే కనీసం స్క్రీన్ మీద కూడా కనిపించలేదు. అట్నుంచి అటే బయటికి పంపించేశారు.వారికి ఇష్టమున్న వారిని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు..

అందంగా ఉన్న వారికే అవకాశం..

చూడడానికి గ్లామర్ గా ఉన్న వారిని సెలెక్ట్ చేస్తున్నారు. కేవలం షో హైప్ కోసం మాత్రమే కామనర్స్ ని హౌస్ లోకి తీసుకుంటున్నాం అని అన్నారు.కానీ అదంతా ఫేక్. కేవలం అది వాళ్ళ స్ట్రాటజీ మాత్రమే. షో హైప్ కోసమే ఇలా చేస్తున్నారు. మిగతా వచ్చిన వాళ్ళందరినీ షో కోసం వాడుకొని వదిలేశారు. ఇక ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను నాగ్ సార్ కి చెప్పాల్సింది ఏమిటంటే.. అక్కడ జడ్జిమెంట్ పూర్తిగా ఫేక్. వాళ్ళు నిజమైన కామనర్స్ ని తీసుకోవడం లేదు. అవకాశం ఉంటే వైల్డ్ కార్డు ద్వారానైనా నన్ను హౌస్ లోకి తీసుకోవాలని నేను కోరుతున్నాను. అలా అయితేనే కామనర్స్ కి న్యాయం జరుగుతుంది. అప్పుడే బిగ్ బాస్ షో కి హుందాతనం ఉంటుంది “అంటూ బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు సిద్దిపేట మోడల్.

ALSO READ:Alcohol Teaser తాగుబోతులపై యుద్ధం ప్రకటించిన అల్లరి నరేష్.. వచ్చేస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త !

Related News

Bigg Boss AgniPariksha: ఆదిరెడ్డి రివ్యూపై శ్రీజ దమ్ము రియాక్షన్.. ఇకనైనా మారండయ్యా!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ నుంచి బిగ్ సర్ప్రైజ్… మరో మూడు రోజుల్లోనే

Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్లోకి మరో లేడీ విలన్.. శోభాను మించి మెప్పిస్తుందా?

Bigg Boss AgniPariksha: 15 కాస్త 13 అయింది.. ట్విస్ట్ తో నరాలు తెగిపోయేలా ఉన్నాయే!

Bigg Boss Agnipariksha : మొన్న ఎవడ్రా.. ఇప్పుడేమో ఇలా.. మనకేంటిరా ఈ ఖర్మ..

Big Stories

×