Niharika Konidela Latest Post: నీహారిక కొణిదెల నిర్మాతగా, నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. మెగా వారసురాలికిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు తెగ కష్టపడుతుంది. నటిగానే కాదు.. నిర్మాతగానూ మారి సినిమాలు చేస్తోంది. విడాకుల తర్వాత తన పర్సనల్ కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టింది. మరోవైపు స్నేహితులతో కలిసి జాలిగా ట్రిప్స్తో వేస్తోంది. ప్రస్తుతం వెకేషన్లో నిహారిక ఒక షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. ఇందులో తన సెప్టీ గురించి ప్రస్తావించింది. తాను క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్న తన తల్లికి సారీ చెబుతూ తన వెకేషన్ ఫోటో షేర్ చేసింది. నిహారిక డేంజర్ పరిస్థితుల్లో కనిపించింది.
సారీ అమ్మ
ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకి అసలు సంగతి ఎంటంటే.. కాగా ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక వెకేషన్లో ఉంది. ఈ సందర్భంగా జలపాతం వద్ద తడుస్తూ.. ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. ఈ వీడియోని షేర్ చేస్తూ తన తల్లికి క్షేమాపణలు చెప్పింది. “మా అమ్మ నేను క్షమంగా రావాలని ప్రార్థనలు చేస్తుంటే.. నేనేమో జలపాతం వద్ద తడుస్తున్న‘ అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చింది. దీనికి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. ‘సారీ అమ్మ‘ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నిహారిక పోస్ట్ తన వదిన, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నవ్వుతున్న ఎమోజీతో స్పందించింది.
నటిగా.. నిర్మాతగా..
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా బ్రదర్ నాగేంద్రబాబు గారాల పట్టిగా మెగా వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఒక మనసు, సూర్యకాంతం వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన.. సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాల్లో ఓ చిన్న పాత్ర పోషించింది. అయితే నటనకు కాస్తా గ్యాప్ తీసుకున్న నిహారిక అదే సమయంలో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుని.. సినిమాలను పూర్తి పక్కన పెట్టింది. అయితే పెళ్లయిన మూడేళ్లకే వైవాహిక జీవితానికి స్వస్తీ చెప్పింది. విడాకుల తర్వాత తన తల్లిదండ్రులతో నివసిస్తున్న ఆమె ఆ తర్వాత సినీ కెరీర్పై ఫోకస్ పెట్టింది. నటనతో పాటు నిర్మాతగానూ మారింది. పింక్ ఎలిఫెంటా పేరుతో సొంతంగా నిర్మాత సంస్థ ప్రారంభించి సినిమాలు నిర్మిస్తోంది.
తన బ్యానర్లో తొలి చిత్రంగా కమిటీ కుర్రాళ్లు మూవీ రూపొందించింది. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్బస్టర్ విజయం సాధిచింది. నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే ఈ మెగా డాటర్ సూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో తన బ్యానర్లో సినిమాలు, వెబ్ సిరీస్లు నిర్మిస్తోంది. మరోవైపు నటిగానూ సత్తా చాటుతుంది. మొన్నటి వరకు తెలుగులో నటించిన ఆమె.. తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ఒరు నల్ల నాల్ పాతు సొల్రెన్, మద్రాస్కారన్ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే తన బ్యానర్లో చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్ వెబ్ సిరీస్లు తెరకెక్కగా.. హలో వరల్డ్ సిరీస్లో నిహారిక కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం తన బ్యానర్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==