Shikhar Dhavan : ప్రస్తుతం ఆన్ లైన్ లో జరిగే ప్రతీ విషయంలో ఏదో ఒక పొరపాటు జరిగి కేసుల వరకు వెళ్తోంది. ఇది రంగం వారిపై పడుతోంది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురు సినీ, క్రికెట్ రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కి కూడా ఇవాళ హాజరు కావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ధావన్ 1ఎక్స్ యాప్ ను ప్రమోట్ చేసినట్టు గుర్తించారు. గతంలో ఈ కేసులో క్రికెటర్ సురేష్ రైనా ను కూడా ప్రశ్నించారు. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, సాధ్యమయ్యే పెట్టుబడులను ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. బెట్టింగ్ యాప్ 1xBet గత ఏడాది డిసెంబర్ లో సురేష్ రైనా ను తమ గేమింగ్ అంబాసిడర్ గా చేసిన విషయం విధితమే.
Also Read : IPL tickets-GST: ఐపీఎల్ కు ఊహించని ఎదురు దెబ్బ… భారీగా పెరగనున్న టికెట్ల ధరలు..ఎంతంటే
ఈ మధ్య కాలంలో అక్రమ ఆన్ లైన్ బెట్టింగ్ ప్లాట్ ఫామ్ లపై ఈడీ దర్యాప్తు ను ముమ్మరం చేసింది. నిషేధిత బెట్టింగ్ ప్లాట్ ఫామ్ లు 1xbet, parimatch, Lotus 365, Fairplay ప్రకటనల్లో దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ తో పాటు నటులు సోను సూద్, ఊర్వశి రౌతేలాను ప్రశ్నించారు. వాస్తవానికి ఈ బెట్టింగ్ ప్లాట్ ఫారమ్ లు తమ ప్రకటనతో స్పోర్టింగ్ లైన్స్ వంటి మారు పేర్లను ఉపయోగిస్తున్నాయి. ఈ ప్రకటనల్లో తరచుగా కోడ్ లు ఉంటాయి. వినియోగదారులను బెట్టింగ్ వెబ్ సైట్ లకు దారి మళ్లిస్తున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. క్రికెటర్ శిఖర్ ధావన్ కి ఈడీ సమన్లు జారీ చేయడంతో మరికొద్ది సేపట్లో ఆయన ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
ముఖ్యంగా బెట్టింగ్ యాప్ కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రముఖ క్రికెటర్లు, సినీ నటీ, నటులకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపడుతోంది. తాజాగా శిఖర్ ధావన్ ని ఇవాళ విచారిస్తోంది. మొత్తం 365 నిషేదిత బెట్టింగ్ ప్లాట్ ఫామ్ లతో ప్రమోషనల్ సంబంధాలపై విచారణ చేపడుతోంది. ఈ సంబంధాలపై భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, సోనూ సూద్, నటి ఊర్వశి రౌతేలా ను ప్రశ్నించినట్టు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఐటీచట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, బినామీ లావాదేవీల చట్టం వంటి పలు భారతీయ చట్టాలను ఉల్లంఘించవచ్చని నిషేదిత బెట్టింగ్ ప్లాట్ ఫామ్ లపై దర్యాప్తు ముమ్మరం చేసారు.
ముఖ్యంగా ఇల్లీగల్ యాప్స్ కి ప్రమోషన్ చేయడం ద్వారా ఏమైనా ఆర్థిక కుట్ర ఉందా..? అనే కోణంలో శిఖర్ ధావన్ ని విచారించే అవకాశం ఉంది.