Hardik Pandya Girl Friend : టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నాలుగేళ్ల వైవాహిక బంధం నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు తను మరొకరితో ముచ్చట్లు పెడుతున్నట్టు నెట్టిల్లు కోడై కూస్తోంది. ఇంతకీ ఎవరా కొత్త గర్ల్ ఫ్రెండ్ అని అందరూ తెగ వెతికేస్తున్నారు. అయితే, ఆ అమ్మాయి ఎవరో కాదు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 546K ఫాలోవర్లు ఉన్న ప్రాచీ సోలంకి.
తనొక డిజిటల్ కంటెట్ క్రియేటర్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె హార్దిక్ పాండ్యాతో దిగిన ఫొటోలను షేర్ చేయడంతో సోషల్ మీడియా సంచలనంగా మారింది. తను వాటితో వదిలేస్తే బాగుండేది.. కానీ పాండ్యా కుటుంబ సభ్యులతో చనువుగా ఉన్న ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతోనే పొగ ఎక్కువై మంట పెద్దదై పోయింది.
అయితే, ప్రాచీ సోలంకితో హార్దిక్ పాండ్యా డేటింగ్ చేయడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆమె కేవలం ఆయన అభిమాని మాత్రమేనని, పాజిటివ్ దృక్పథంతో చూడాలని అంటున్నారు. హార్దిక్ కూడా సెలబ్రిటీ కావడం వల్ల, తనని కలిసి ఫొటోలు దిగినట్లు సర్ది చెబుతున్నారు.
అలాగైతే ఒక అభిమానితో ఫొటోలు దిగినందుకే నటాషా విడిపోతుందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు పాండ్యా మరొక అమ్మాయితో డేటింగులో ఉన్నాడని నటాషా చెప్పింతర్వాత ఇంకెందుకు డౌట్లు అని కూడా అంటున్నారు. అది నిజం కాబట్టే, తను వైవాహిక బంధాన్నే వదిలేసిందని అంటున్నారు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పాండ్యా ఎవరితో కలిసి ఉన్నాడనేది నటాషా చెప్పలేదు. అవతల డేటింగులో ఉన్నట్టుగా చెబుతున్న అమ్మాయి నోటి వెంటా రాలేదు. పాండ్యా కూడా బయటపడటం లేదు. ఓడిపోయే మ్యాచ్ ముందు కెమెరా వైపు చూసినట్టు, జరిగేవన్నీ అలా చూస్తున్నాడు.
నిప్పు లేనిదే పొగ రాదు కదా…చుట్టూ కోట్ల రూపాయల డబ్బులు, పేరుకు పేరు, ప్రజల్లో గౌరవం, స్టార్ స్టేటస్ ఇవన్నీ ఎవరు వదులుకుంటారు. అందుకే సెలబ్రిటీల వెంట అమ్మాయిలు పరుగులెడుతుంటారు. అప్పుడే వీరు స్థితప్రజ్ణతతో ఉండాలని అంటారు. కానీ పాండ్యా విషయంలో అలా జరగలేదు.
అయితే క్రికెటర్ల ప్రేమాయణాలు ఈనాటివి కాదని నెటిజన్లు పేర్కొంటున్నారు. నాడు రవిశాస్త్రి-అమ్రతా సింగ్, అజారుద్దీన్- సంగీతా బిజిలానీ తదితరులు కూడా ఇలాగే సంచనలం స్రష్టించారని అంటున్నారు. అదే వారసత్వంగా నేడు పాండ్యా వరకు పాకిందని అంటున్నారు.
ఇంతకీ హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ప్రాచీ సోలంకి-హార్దిక్ పాండ్యా-నటాషా ముగ్గురిలో ఎవరో ఒకరు నోరు తెరిస్తే తప్ప, ఈ చిదంబర రహస్యం బయటపడదని అంటున్నారు. లేదంటే ప్రాచీ సోలంకి కే వళ్లుమండి ఫొటోలు బయటపెట్టిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.