IND W VS AUS W Semis: వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ( ICC Womens World Cup 2025 ) భాగంగా ఇవాళ మరో సెమీ ఫైనల్స్ జరుగనుంది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య మరికాసేపట్లోనే సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో గెలిచిన జట్టు వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ కు దూసుకెళుతుంది. ఈ తరుణంలోనే రెండో సెమీ ఫైనల్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. దీంతో టీమిండియా మొదట బౌలింగ్ చేయాల్సి వస్తోంది.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ ఫైట్ జరుగుతోంది. నవీ ముంబై లోని డివైస్ పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ఈ రెండో సెమీ ఫైనల్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తోంది ఆస్ట్రేలియా. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారానున్న నేపథ్యంలో సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్లకు అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంటే ఈ లెక్కన టీమిండియా టాస్ ఓడిపోవడం మంచిదైంది. ఒకవేళ ఇవాళ వర్షం పడి మ్యాచ్ ఆగిపోయినప్పటికీ రిజర్వుడే ఉంటుంది. రేపటి రోజున ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. రేపు కూడా మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం పొంచి ఉంటే.. ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుతుంది. పాయింట్ల పట్టికలో టీమిండియా కంటే మెరుగ్గా ఆస్ట్రేలియా ఉంది. పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. అలా చూసుకున్నట్లయితే మ్యాచ్ రద్దు అయితే నేరుగా ఆస్ట్రేలియా ఫైనల్ కు వెళ్లి, దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా ( Australia Women vs India Women ) మధ్య ఇవాళ రెండో సెమీ ఫైనల్ జరుగుతున్న నేపథ్యంలో రికార్డులు భారతీయులను వణికిస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య వన్డే రికార్డులు పరిశీలిస్తే, ఆస్ట్రేలియాపై చేయి సాధించింది. ఇప్పటి వరకు టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొత్తం 60 మ్యాచ్ లు జరిగాయి. ఈ 60 మ్యాచ్ లలో మొత్తం 49 మ్యాచ్ లలో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. కేవలం 11 మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించింది. అంటే టీమిండియాపైన ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కాగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ రెండో సెమీ ఫైనల్ హాట్ స్టార్ లో చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ లు తిలకించవచ్చు.