IND W VS AUS W Semis: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ( ICC Womens World Cup 2025) భాగంగా ఇవాళ రెండో సెమీ ఫైనల్ జరిగింది. ఈ రెండో సెమీ ఫైనల్ లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia Women vs India Women ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. నవీ ముంబై డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ ( Dr DY Patil Sports Academy, Navi Mumbai ) వేదికగా ఈ రెండో సెమీ ఫైనల్ నిర్వహించారు. అయితే ఇందులో టాస్క్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు…. భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆలౌట్ అయింది మహిళల ఆస్ట్రేలియా జట్టు. ఇక ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో 339 పరుగుల చేధించాలి టీమిండియా మహిళల జట్టు. ఒకవేళ ఇందులో టీమిండియా గెలిస్తే ఫైనల్స్ కు దూసుకెళుతుంది. అదే ఆస్ట్రేలియా గెలిస్తే, టీమిండియా ఇంటికి వెళ్లడమే అవుతుంది. మొత్తానికి ఇందులో గెలిచిన జట్టు ఫైనల్స్ లో దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంటుంది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ రెండో సెమీ ఫైనల్ లో టీమిండియా అలాగే ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. ముఖ్యంగా ఫోబ్ లిచ్‌ఫీల్డ్ ( Phoebe Litchfield )సెంచరీ తో దుమ్ము లేపింది. 93 బంతుల్లో 119 పరుగులు చేసి రెచ్చిపోయింది. ఇందులో మూడు సిక్సర్లు అలాగే 17 బౌండరీలు ఉన్నాయి. 127.96 స్ట్రైక్ రేట్ తో దుమ్ములేపింది. అలాగే ఎల్లీస్ పెర్రీ ( Ellyse Perry ) 88 బంతుల్లో 77 పరుగులతో రఫ్ ఆడించింది. ఇందులో రెండు సిక్సర్లతో పాటు ఆరు బౌండరీలు ఉన్నాయి. అటు మిడిల్ ఆర్డర్ లో వచ్చిన ఆష్లీ గార్డనర్ 63 పరుగులతో రాణించారు.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో టీమిండియా మహిళల జట్టు చెత్త ఫీల్డింగ్ కొంపముంచింది. చెత్త ఫీల్డింగ్ కారణంగా చాలా క్యాచ్ లు, అదనంగా పరుగులు ఇచ్చారు టీమిండియా ప్లేయర్లు. అదే సమయంలో అనవసరంగా త్రో విసరడంతో అదనంగా పరుగులు కూడా వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా రెచ్చిపోయి, భారీ స్కోర్ చేసింది. కాగా శ్రీ చరణీ ( Sri charani), దీప్తి శర్మ ( Deepthi sharma) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అమన్ జోత్, రాధ యాదవ్ తలో ( Radha Yadav) వికెట్ పడింది. ఇక బౌలింగ్ దారుణంగా విఫలమైన టీమిండియా మహిళల జట్టు, బ్యాటింగ్ లో రాణిస్తుందా? లేదా? చూడాలి.
— Out Of Context Cricket (@GemsOfCricket) October 30, 2025