E-Paper
Advertisement

OTT Movie : శుద్ధీకరణ పేరుతో సిగ్గులేని పని… భర్తను చంపేసి ఆశ్రమంలో అరాచకం… పెద్దలకు మాత్రమే

OTT Movie : శుద్ధీకరణ పేరుతో సిగ్గులేని పని… భర్తను చంపేసి ఆశ్రమంలో అరాచకం… పెద్దలకు మాత్రమే
Advertisement

OTT Movie : ఆడియన్స్ మైండ్ ని బెండ్ చేసే స్టోరీలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒక డిఫరెంట్ స్టోరీ ఓటీటీలో ఆడియన్స్ ని ఆలోచనల్లో పడేస్తోంది. ఇది భవిష్యత్ భారతదేశంలో మతం, కులం ఆధారంగా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరిని చూపిస్తుంది. కొన్ని సంవత్సరాల తరువాత భారత దేశం ఎలా ఉంటుదో ఒక లవ్ స్టోరీ ద్వారా ఈ సిరీస్ లో చూపించారు. హీరో సిద్ధార్థ్ పాత్ర ఈ సిరీస్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘లీలా’ (Leila) 2019లో విడుదలైన హిందీ భాషా డిస్టోపియన్ వెబ్ సిరీస్. ప్రయాగ్ అక్బర్ 2017 లో రచించిన ‘లీలా’ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. దీనికి దీపా మెహతా, షాంకర్ రామన్, పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో హుమా ఖురేషి, సిద్ధార్థ్, రాహుల్ ఖన్నా, సంజయ్ సూరి ప్రధాన పాత్రల్లో నటించారు. 6 ఎపిసోడ్‌లతో కూడిన ఈ సీరీస్ 2019 జూన్ 14 నుంచి  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

భారతదేశం పాతిక సంవత్సరాల తరువాత ఆర్యవర్త్ అనే ఒక రాష్ట్రంగా మారి పోయింది. మతం ఆధారంగా పాలన ఉంటుంది. ఇక్కడ ఒక ధనిక హిందూ కుటుంబం నుండి వచ్చిన శాలినీ అనే యువతి, ఒక ముస్లిం యువకుడు రిజ్వాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వీరికి లీలా అనే కూతురు పుడుతుంది. కానీ ఆర్యవర్త్ రూల్స్ ప్రకారం “మిక్స్డ్ మ్యారేజ్” పిల్లలు ప్రభుత్వానికి చెందుతారు. వారిని “ప్యూరిటీ క్యాంప్”లో పెంచి హిందూ సంస్కృతిలో మార్చేస్తారు. ఒక రోజు రాత్రి కొంతమంది ఇంట్లోకి దూరి, రిజ్వాన్‌ను కాల్చి చంపి, లీలాను బలవంతంగా తీసుకుపోతారు. శాలినీని జైలులో పడేస్తారు. ఆమె జీవితం ఒక్కసారిగా నాశనమవుతుంది. కొంత కాలం తరువాత జైలు నుండి బయటకు వచ్చిన శాలినీ తన కూతుర్ని వెతకడం మొదలుపెడుతుంది.

Read Also : భర్త లేని టైమ్ లో భార్య గదిలోకి… ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి కన్పిస్తే కథ కంచికే… పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

Advertisement

ఈ సమయంలో లీలా ఒక ఎలైట్ ప్యూరిటీ క్యాంప్‌లో ఉందని శాలినీకి తెలుస్తుంది. ఆ క్యాంప్‌కు చేరుకోవాలంటే ఆమె ప్రాణాలకు తెగించాల్సి వస్తుంది. ఒక ఫేక్ ఐడెంటిటీతో, ఒక హై-సెక్యూరిటీ ప్యూరిటీ క్యాంప్‌లోకి దూరుతుంది. అక్కడ పిల్లలు యూనిఫాం ధరించి, హిందూ మంత్రాలు పఠిస్తూ, తమ గతాన్ని మరచిపోయేలా బ్రెయిన్‌వాష్ చేస్తుంటారు. అది పేరుకే ఆశ్రమం, కానీ ఆరాచకాలకు కేంద్రం.  అక్కడ ఎంతో కష్టపడి లీలాను శాలినీ కలుస్తుంది. కానీ లీలా ఇప్పుడు తన తల్లిని గుర్తుపట్టదు. ఈ దృశ్యం శాలినీ హృదయాన్ని పిండేస్తుంది. క్లైమాక్స్ భయంకరమైన ట్విస్టులతో ఎండ్ అవుతుంది. ఆ ట్విస్టులు ఏమిటి ? లీలా, శాలినీ అక్కడి నుంచి బయట పడతారా ? ఈ కథ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను ఈ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

 

Related News

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఎక్కడ ?ఎప్పుడంటే?

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

Big Stories

Advertisement
×