 
					Womens World Cup 2025 Finals: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025) తొలిదశకు వచ్చేసింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ లో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మహిళల ( India Women vs South Africa Women, Final) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. తొలి సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ ను ఓడించి దక్షిణాఫ్రికా ఫైనల్ కు వచ్చేసింది. ఇక నిన్న ఆస్ట్రేలియా అలాంటి ఏడుసార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టును ఓడించిన టీమిండియా కూడా ఫైనల్ కు చేరుకుంది. నవంబర్ 2వ తేదీన దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
ఐసీసీ వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ నవీ ముంబై లోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ( Dr DY Patil Sports Academy, Navi Mumbai) నిర్వహించనున్నారు. ఎప్పటి లాగే నవంబర్ 2న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ ను జియో హాట్ స్టార్ లో చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ వస్తుంది.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ రెండవ తేదీన జరగబోయే ఫైనల్ మ్యాచ్కు వర్షం అద్దంకిగా మారే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ముంబైలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. నవంబర్ రెండో తేదీన అంటే ఆదివారం రోజున కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఫైనల్ రోజున భారీ వర్షం పడితే, మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే, సోమవారం రోజున మ్యాచ్ నిర్వహిస్తారు. అంటే ఫైనల్ కు రిజర్వ్ డే ఉంటుంది. రిజర్వ్ డే రోజున ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్లీ ప్రారంభమవుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల రిజర్వ్ రోజు కూడా మ్యాచ్ రద్దు అయితే… దక్షిణాఫ్రికా విజేతగా నిలుస్తుంది. పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. టీమిండియా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ లెక్క ప్రకారం దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ విజేత అవుతుంది. అప్పుడు టీం ఇండియా రన్నరప్ గా మిగిలాల్సిందే. మరి ఫైనల్స్ లో ఏం జరుగుతుందో చూడాల్సిందే. ఎవరూ గెలిచిన చరిత్రే అవుతుంది. ఇండియా, దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు వరల్డ్ కప్ నెగ్గలేదు.
Also Read: SHREYAS IYER: గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్.. కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే
JEMIMAH RODRIGUES HUGGING HER FATHER. ❤️
– A lovely video. pic.twitter.com/kj4tGRRkKI
— Johns. (@CricCrazyJohns) October 30, 2025