Renuka Singh Thakur: వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ తుది దశకు వచ్చేసింది. ఇవాళ రెండో సెమీ ఫైనల్స్ జరుగుతోంది. ఈ రెండో సెమీస్ టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia Women vs India Women, 2nd Semi-Final ) మధ్య ఫైట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేయగా, టీమిండియా బౌలింగ్ చేసింది. ఈ తరుణంలోనే నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా మహిళ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ కు ( Renuka Singh Thakur ) ఘోర అవమానం ఎదురైంది. రేణుకా సింగ్ ఠాకూర్ ను పాకిస్తాన్ సోషల్ మీడియా ఆడుకుంటోంది. రేణుకా సింగ్ ఠాకూర్ ఫాస్ట్ బౌలర్ కాదని, స్పిన్నర్ అంటూ దారుణంగా పోస్టులు పెడుతున్నారు పాకిస్తాన్ నీచులు.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరుగగా, టీమిండియా బౌలర్ వన్డే రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్ చేసింది. వాస్తవంగా రేణుకా సింగ్ ఠాకూర్ మీడియం ఫాస్ట్ బౌలర్. అంటే 100కు పైగా స్పీడ్ తో బంతులు వేస్తుంది. కానీ ఇవాళ 97.6 స్పీడ్ తోనే బౌలింగ్ చేసింది. ఆమె మహిళ కాబట్టి స్పీడ్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మగాళ్లు అయితే, కనీసం 120 కి పైగా స్పీడ్ వేస్తారు. రేణుకా సింగ్ ఠాకూర్ లేడీ కాబట్టి స్పీడ్ వేయలేదు. ఈ విషయాన్ని గుర్తించకుండా, పాకిస్తాన్ ట్రోలర్స్ రెచ్చిపోయారు.
రేణుకా సింగ్ ఠాకూర్ కంటే స్పీడ్ గా బాబర్ ఆజాం బౌలింగ్ చేస్తాడని సెటైర్లు పేల్చారు. వాస్తవంగా బాబర్ ఆజాం బౌలింగే వేయడు. కేవలం బ్యాటింగ్ చేస్తాడు. అలాంటి వాడిని, రేణుకా సింగ్ ఠాకూర్ తో పోల్చుతూ ట్రోలింగ్ చేశారు. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. పాకిస్తాన్ వాళ్లకు ఎక్కడా పని లేదని ఫైర్ అవుతున్నారు. మగాళ్లతో క్రికెట్ ఓడిన పోయిన పాకిస్తానీలు.. ఇప్పుడు మహిళలతో పోటీ పడుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు ఇండియన్స్. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది.
— Out Of Context Cricket (@GemsOfCricket) October 30, 2025