BigTV English
Advertisement

OTT Movie : ముక్కలైన శవాలను పేర్చి దిక్కుమాలిన ప్రయోగం… థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలోకి హాలీవుడ్ హర్రర్ మూవీ

OTT Movie : ముక్కలైన శవాలను పేర్చి దిక్కుమాలిన ప్రయోగం… థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలోకి హాలీవుడ్ హర్రర్ మూవీ

OTT Movie : సైన్స్ ఫిక్షన్ సినిమాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అందులోనూ హారర్ కంటెంట్ తో వచ్చే స్టోరీలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. శాస్త్రవేత్తల ప్రయోగాలు వినాశనం వైపు అడుగులు వేస్తే ఎలా ఉంటుందో ఈ కథ చూపిస్తుంది. 19వ శతాబ్దపు స్విట్జర్లాండ్‌లో ఒక శాస్త్ర వేత్త మరణాన్ని జయించాలనే కోరికతో మానవ శరీర భాగాలతో ఒక జీవిని సృష్టిస్తాడు. ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకు ఈ సినిమా బెస్ట్ సజెషన్. ఈ సినిమా క్లైమాక్స్ అస్సలు మిస్ అవ్వకండి. థియేటర్లలో విడుదలైన నెల లోపే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. వచ్చే వారం ఇది డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘ఫ్రాంకెన్‌ స్టైయిన్’ (Frankenstein) 2025లో విడుదలైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ చిత్రం. దీనిని గిల్లెర్మో డెల్ టోరో దర్శకత్వం వహించి, నిర్మించారు. ఇది మేరీ షెల్లీ రాసిన 1818 నవల ఫ్రాంకెన్‌స్టైయిన్ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో ఆస్కార్ ఐజాక్, జాకబ్ ఎలోర్డి, మియా గోత్, ఫెలిక్స్ కమ్మెరర్, డేవిడ్ బ్రాడ్లీ, లార్స్ మికెల్సెన్ వంటి నటులు నటించారు. ఇది అక్టోబర్ 17, 2025న థియేటర్లలో విడుదలైంది, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నవంబర్ 7 నుంచి గ్లోబల్ డిజిటల్ విడుదలకు సిద్ధంగా ఉంది.

స్టోరీ ఏమిటంటే

విక్టర్ తన ప్రియురాలు ఎలిజబెత్ మరణంతో డిప్రెషన్ లోకి వెళ్తాడు. ఆ తరువాత మరణాన్ని జయించడానికి ప్రయోగాలకు సిద్దపడతాడు. ఒక యూనివర్సిటీలో వాల్డ్‌మన్ అనే ప్రొఫెసర్ సహాయంతో రహస్య ప్రయోగాలు చేస్తాడు. మానవ శవాల నుండి భాగాలు సేకరించి, ఒక మెరుపు శక్తితో జీవం పోస్తాడు. అలా పుట్టిన క్రీచర్ భయంకరమైన రూపంలో ఉంటుంది. అయితే ఒక పిల్లాడి స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉంటుంది. విక్టర్ మొదట దాన్ని చూసి భయపడి పారిపోతాడు. ఒంటరిగా మిగిలిన క్రీచర్ గ్రామాల్లో తిరుగుతూ మానవుల నుంచి దాడులను ఎదుర్కొంటుంది. కానీ ఒక అంధుడైన వృద్ధుడి ఇంట్లో మాత్రం ప్రేమ, పుస్తకాల ద్వారా మానవత్వాన్ని నేర్చుకుంటుంది.


Read Also : వివాదాలతో విజయ్ సేతుపతిని ఆగమాగం చేసిన కాంట్రవర్సీ మూవీ… స్ట్రీమింగ్ డేట్ ఇదే

కొంత కాలం తరువాత క్రీచర్ తన సృష్టికర్తను వెతుక్కుంటూ విక్టర్‌ను కలుస్తుంది. నాకు ఒక తోడుని సృష్టించు, లేకపోతే నీ జీవితాన్ని నాశనం చేస్తాను అని బెదిరిస్తుంది. విక్టర్ మొదట అంగీకరించి మరో స్త్రీ క్రీచర్‌ను సృష్టించడం మొదలుపెడతాడు. కానీ ఆ రెండూ కలిసి ప్రపంచాన్ని దుర్భరం చేస్తాయనే భయంతో ఆ ప్రయోగాన్ని నాశనం చేస్తాడు. ఈ ద్రోహం క్రీచర్‌ను ప్రతీకార తీర్చుకునే దెయ్యంగా మారుస్తుంది. అది విక్టర్ సన్నిహితులను ఒక్కొక్కరిగా చంపడం మొదలు పెడుతుంది. విక్టర్ ని ఆర్కిటిక్ మంచు పర్వతాల వరకు వెంటాడుతుంది. చివరికి ఆర్కిటిక్ ఐస్‌ ల్యాండ్స్‌లో ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు ఏంటి ? విక్టర్ ని ఆ క్రీచర్‌ చంపుతుందా ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

Friday OTT Releases: శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..ఒంటరిగా మాత్రం అస్సలు చూడకండి..

OTT Movie : బ్రూటల్ మర్డర్స్… అమ్మాయిల బట్టల వాసన చూస్తూ ఆ పాడు పని చేసే సైకో… రోమాలు నిక్కబొడుచుకునే సీన్లు

OTT Movie : భార్య కళ్ళముందే విదేశీ అమ్మాయితో… అన్నీ అవే సీన్లు… కల్లోనూ కలవరింతలు పుట్టించే కథ

OTT Movie : శుద్ధీకరణ పేరుతో సిగ్గులేని పని… భర్తను చంపేసి ఆశ్రమంలో అరాచకం… పెద్దలకు మాత్రమే

OTT Movie : పెళ్ళాం గదిలోకి దగ్గరుండి మరో మగాడిని పంపే భర్త… సింగిల్ గా చూడాల్సిన అరాచకం మావా

OTT Movie : మాజీ ప్రియుడి బ్లాక్ మెయిల్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్, టర్న్ ఉన్న సినిమా… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : అబ్బాయిలకు వలపు వల… పడిపోయారో పరలోకానికే… గ్రిప్పింగ్ లేడీ కిల్లర్ థ్రిల్లర్

Big Stories

×