BigTV English
Advertisement

Gautam Gambhir: 5 గురు జీవితాలను సర్వనాశనం చేసిన గౌతమ్ గంభీర్.. ఈ పాపం ఊరికే పోదు !

Gautam Gambhir: 5 గురు జీవితాలను సర్వనాశనం చేసిన గౌతమ్ గంభీర్.. ఈ పాపం ఊరికే పోదు !

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన నిర్ణయాల వల్ల మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాడు. టీమిండియా స్టార్ బౌలర్, టి-20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అర్షదీప్ సింగ్ ని పదే పదే పక్కన పెడుతూ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి-20 సిరీస్ లోని తొలి మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ కి అవకాశం కల్పించకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది.


Also Read: Kuldeep yadav: న‌ర్సుతో ఎ**ఫైర్ పెట్టుకున్న కుల్దీప్ యాద‌వ్.. ఏకంగా బెడ్ పైనే ?

టి-20 ఫార్మాట్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన అర్షదీప్ సింగ్ కి.. గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటినుండి జట్టులో స్థానం కష్టంగా మారింది. తొలి టి-20 కోసం అర్షదీప్ ని పక్కన పడేసి.. హర్షిత్ రాణా ని జట్టులోకి తీసుకున్నాడు. ఈ క్రమంలో గంభీర్ పై మండిపడుతున్న క్రీడాభిమానులు.. ఈ ఒక్క ఆటగాడినే కాకుండా గంభీర్ ఐదుగురు స్టార్ క్రికెటర్ల జీవితం నాశనం చేశాడని.. ఈ పాపం ఊరికే పోదంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కొందరు ప్లేయర్లను టార్గెట్ చేసిన గంభీర్:

2024 లో జరిగిన ఐపిఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే. కేకేఆర్ ఛాంపియన్ గా నిలవగానే ఆ క్రెడిట్ మొత్తం గంభీర్ కి వెళ్లిపోయింది. అటు కేప్టెన్ శ్రేయస్ అయ్యర్ కి గాని, ఇతర జట్టు ఆటగాళ్లకు కానీ ఏమాత్రం క్రెడిట్ దక్కలేదు. అదే సమయంలో రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో గౌతమ్ గంభీర్ కి టీమిండియా కోచ్ బాధ్యతలను అప్పగించారు. ఇక బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కొందరు ప్లేయర్లను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు గంభీర్. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా ఉన్నారు. అదే సమయంలో వీరు టెస్టుల్లో ఘోరంగా విఫలం కావడం గంభీర్ కి అనుకూలంగా మారింది. ఆ తర్వాత కొంతకాలానికే రోహిత్ శర్మ తన టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

గంభీర్ కారణంగానే రిటైర్మెంట్ ప్రకటించారా..?

గంభీర్ కోచ్ గా వచ్చి ఏడాది పూర్తికాకుండానే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టులకు ఏకంగా రిటైర్మెంట్ కూడా ప్రకటించారు. ఇక తాజాగా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వన్డే కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ నుంచి లాక్కొని గిల్ కి బదిలీ చేశారు. ఇక గాయం కారణంగా రిషబ్ పంత్ ఈ సిరీస్ కి దూరం కావడంతో.. బ్యాకప్ వికెట్ కీపర్ గా సంజూ శ్యాంసన్ ని ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా దృవ్ జురెల్ ని బ్యాకప్ వికెట్ కీపర్ గా ఎంపిక చేశారు. దీంతో సంజు శాంసన్ అభిమానులు హెడ్ కోచ్ గంభీర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజు తన చివరి వన్డే ని 2023 లో ఆడాడు. సౌత్ ఆఫ్రికా తో జరిగిన ఆ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత సంజు కి మరోసారి వన్డేలో అవకాశం లభించలేదు.

ఈ ముగ్గురు మాత్రమే కాకుండా మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకోకపోవడం వెనకాల గౌతమ్ గంభీర్ ఉన్నాడనే వాదన కూడా ఉంది. మహమ్మద్ షమీ భారత్ తరపున చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఆ తర్వాత ఏ ఫార్మాట్ లోను జాతీయ జట్టుకు ఎంపిక కాలేకపోయాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన మహమ్మద్ షమీ అదరగొడుతున్నాడు. బెంగాల్ తరఫున ఆడుతున్న మహమ్మద్ షమీ.. ఎలైట్ గ్రూప్ సిలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. ఇలా రంజీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచినప్పటికీ మహమ్మద్ షమీకి జట్టులో చోటు దక్కట్లేదు.

Also Read: KL Rahul: ఐపీఎల్ 2026 కంటే ముందే కేఎల్ రాహుల్ కు రూ.25 కోట్ల ఆఫ‌ర్ ?

వీరితోపాటు యశస్వి జైష్వాల్ పరిస్థితిపై కూడా క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైష్వాల్ తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి అద్భుతంగా రానిస్తుంటాడు. సెంచరీలతో సత్తా చాటినా సరే కొన్నిసార్లు అవకాశం మాత్రం రాలేని పరిస్థితి జైష్వాల్ ది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ కి జైస్వాల్ ని ఎంపిక చేసింది సెలెక్షన్ కమిటీ. కానీ జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. కెప్టెన్ గిల్ కంటే ఫాస్ట్ పిచ్ లలో అతడు మెరుగ్గా రాణించిన సందర్భాలు ఉన్నాయి. మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉన్న ఆటగాడు అయిన జైష్వాల్.. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ కి మాత్రమే పరిమితమయ్యాడు. ఇలా ఈ ఐదుగురు క్రికెటర్ల జీవితాలను గౌతమ్ గంభీర్ నాశనం చేశాడంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు క్రీడాభిమానులు.

 

 

View this post on Instagram

 

Related News

IND W VS AUS W Semis: ఆస్ట్రేలియా ఆలౌట్‌… టీమిండియా ముందు కొండంత టార్గెట్‌..ఫైన‌ల్స్ మ‌ర‌చిపోవాల్సిందే !

IND W VS AUS W Semis: టాస్ ఓడిన టీమిండియా…కొండ‌లాంటి ఆస్ట్రేలియాను త‌ట్టుకుంటారా? ఇంటికి వ‌స్తారా ?

Kuldeep yadav: న‌ర్సుతో ఎ**ఫైర్ పెట్టుకున్న కుల్దీప్ యాద‌వ్.. ఏకంగా బెడ్ పైనే ?

KL Rahul: ఐపీఎల్ 2026 కంటే ముందే కేఎల్ రాహుల్ కు రూ.25 కోట్ల ఆఫ‌ర్ ?

SHREYAS IYER: గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్.. క‌న్నీళ్లు పెట్టుకోవాల్సిందే

Australia Cricketer Dies: ఆస్ట్రేలియాలో మ‌రో పెను విషాదం..బంతి తగిలి క్రికెటర్ మృతి

Yuzvendra Chahal: హీరో నాని లవ్ ఫెయిల్యూర్ పాట‌కు యుజ్వేంద్ర చాహల్ చిందులు

Big Stories

×