BigTV English

Rinku Singh : 9వ తరగతి ఫెయిల్.. ఇంగ్లీష్ రాదు బొంగు రాదు.. రింకూ సింగ్ పై దారుణంగా ట్రోలింగ్ !

Rinku Singh : 9వ తరగతి ఫెయిల్.. ఇంగ్లీష్ రాదు బొంగు రాదు.. రింకూ సింగ్ పై దారుణంగా ట్రోలింగ్ !

Rinku Singh : టీమిండియా(team India) క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతను ఐపీఎల్ లో ఐదు సిక్సులు కొట్టి కేకేఆర్ ని గెలిపించి ఫేమస్ అయ్యాడు. టీ-20 టీమిండియా జట్టుకు ఎంపికయ్యాడు. అతని జీవితం గురించి పరిశీలించినట్టయితే.. తండ్రి గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి అయినా.. క్రికెట్ ని నమ్మకొని పైకి వచ్చాడు బ్యాటర్ రింకూ సింగ్. రెండేళ్లుగా జాతీయ టీ-20 జట్టులో భాగమైన రింకూ ఇప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంతగా స్థిరపడ్డాడు. 2025 లో రూ.13 కోట్లకు రిటైన్ చేసుకుంది కోల్ కతా నైట్ రైడర్స్. అంతకు ముందు రింకూసింగ్ మూడు సీజన్లలో రింకూ రేట్ రూ.55లక్షలే కావడం గమనార్హం. ఇదే రేటుతో టీమిండియా కి ఎంపికై సెంట్రల్ కాంట్రాక్టు పొందాడు.


Also Read : The Rock: హిజ్రాగా మారిన రెజ్లర్ “ది రాక్”… ఈ వీడియో చూస్తే షాక్ కావాల్సిందే

రింకూ సింగ్ పై ఘోరంగా ట్రోలింగ్స్.. 


ఇదిలా ఉంటే.. తాజాగా రింకూ సింగ్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ చేయడం గమనార్హం. 9వ తరగతి ఫెయిల్, ఇంగ్లీషు రాదు.. ఏమి రాదు అంటూ ఘోరంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.  ఇక తన సొంత ఊరు అలీగఢ్ లో దాదాపు రూ.4కోట్లు ఖర్చు పెట్టి విల్లా కొన్న ఈ యూపీ క్రికెటర్.. దానికి వీణా ప్యాలెస్ అని తల్లిపేరు పెట్టారు. మరోవైపు ఈ విల్లాలోనే ఓ ప్రత్యేక ప్రదేశంలో తాను 5 సిక్సులు కొట్టిన బ్యాట్ ను ప్రత్యేకంగా ప్రేమ్ కట్టించాడు. రింకూ త్వరలోనే ఓ ఇంటివాడు కూడా కానున్నాడు. లోక్ సభ ఎంపీ ప్రియా సరోజ్ ను త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈనెల 08న వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. నవంబర్ 18న వీరి పెళ్లి నిర్ణయించినా.. ఆ సమయంలో సౌతాఫ్రికా టూర్ ఉండటంతో వాయిదా పడుతుందనే కథనాలు వచ్చాయి.

9వ తరగతికే ఎడ్యుకేషన్ ఆఫీసరా..? 

తాజాగా రింకూ సింగ్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. స్కూల్ డ్రాపౌట్ అయిన రింకూ సింగ్ ను అతని సొంత రాష్ట్రం యూపీ ప్రభుత్వం బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా నియమించడం పై ట్రోలింగ్ నడుస్తోంది. రింకూ 9వ తరగతి మధ్యలో ఆపేశాడు. తండ్రి పనిలో చేదోడుగా ఉండేవాడు. ఒక దశలో స్వీపర్ గా పని చేసేందుకు వెనుకాడలేదు. క్రికెట్ పై ఇష్టంతో పైకి వచ్చాడు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన రాష్ట్ర క్రీడాకారులను నేరుగా ఉద్యోగాల్లో నియమించి గౌరవిస్తుంది. అలా రింకూ సింగ్ ను జిల్లా బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా నియమించింది. దీనిని నెటిజన్లు తప్పుబడుతున్నారు. తక్కువ చదువుకున్న వారు పెద్ద ఉద్యోగాలకు అర్హులని కొందరూ ఎద్దేవా చేస్తున్నారు. 9వ తరగతి చదివిన వ్యక్తిని ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా నియమించడం ఏంటి..? అని ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇక మరోవైపు యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక రింకూ సింగ్ పెళ్లాడబోయేది ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాది పార్టీ ఎంపీని.. అయినా యూపీ ప్రభుత్వం రింకూ కి ఉద్యోగం ఇవ్వడం విశేషం.

?igsh=MWJ0NXB5ZTR0c2VzNA==

 

Related News

Ashwin Un sold : అశ్విన్ కు ఘోర అవమానం.. అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు

BCCI : బీసీసీఐ దెబ్బకు దిగివ‌చ్చిన న‌ఖ్వీ….ట్రోఫీ ఇచ్చేసిన ఏసీసీ

Ind vs WI, 1st Test: రేప‌టి నుంచే విండీస్ తో తొలి టెస్ట్‌..జ‌ట్ల వివ‌రాలు.. ఉచితంగా ఎలా చూడాలంటే

AUS Vs NZ : రాబిన్స‌న్ సెంచ‌రీ చేసినా.. ఆస్ట్రేలియానే విజ‌యం

Tilak-Dube : శివమ్ దూబేకు తిలక్ వర్మ వెన్నుపోటు…? గంభీర్ కు జరిగిన అన్యాయమే ఇప్పుడు రిపీట్

Mohsin Naqvi : సూర్య.. నా ఆఫీస్‍‌కొచ్చి కప్పు తీసుకెళ్లు… నఖ్వీ కొత్త కండీష‌న్లు

Vaibhav Suryavanshi : ఆస్ట్రేలియాపై సూర్యవంశీ సూపర్ సెంచరీ… ఏకంగా 8 సిక్సర్లు

Tilak Verma : త‌మ్ముడు తిల‌క్‌…ఆంధ్ర వాడి దెబ్బ.. పాకిస్తాన్ వాడి అబ్బా… జై జగన్ అంటూ

Big Stories

×