E-Paper
Advertisement

ChatGPT: చాట్ జీపీటీని సలహా అడిగింది.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది, ఇలా మీరు చేయకండి

ChatGPT: చాట్ జీపీటీని సలహా అడిగింది.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది, ఇలా మీరు చేయకండి
Advertisement

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్లను నమ్మేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. చదువు, ఉద్యోగం, వంటలు, ఆరోగ్యం వంటి అనేక అంశాల్లో ప్రజలు ChatGPT వంటి టూల్స్‌పై ఆధారపడుతున్నారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన AI మీద అతి నమ్మకం ఎంత ప్రమాదకరమో చెబుతోంది. ChatGPT ఇచ్చిన ఒక తప్పు సలహా వల్ల ఓ మహిళ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. కానీ ఆమె తెలివైన నిర్ణయంతో బతికి బట్టకట్టగలిగింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చాట్ జీపీటీ తప్పుడు సలహా
ఒక మహిళ తన ఇంటి పరిసరాల్లో పెరిగిన ఒక మొక్కను గమనించింది. అదేంటో ఆమెకు తెలియలేదు. అది తినవచ్చా లేదా అని ఫోటో పెట్టి మరీ ChatGPT‌ని అడిగింది. ChatGPT చాలా నమ్మకంగా అది సాధారణ కూరగాయ మొక్కలా ఉందని, పెద్దగా ప్రమాదం ఉండదని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానంపై అనుమానం వచ్చిన ఆమె స్నేహితులు, అదే మొక్కను ఇంటర్నెట్లో కూడా వెతికారు. ఆ మొక్క ఫోటోను గూగుల్ లెన్స్ ద్వారా చెక్ చేయగా, అది తినదగిన మొక్క కాదని పైగా ప్రాణాలు తీసే మొక్క అనే షాకింగ్ నిజం బయటపడింది.

Advertisement

Also read: Train: రైలు చివరి బోగీపై X గుర్తు ఎందుకు ఉంటుంది? దీని వెనుక అర్థమేంటి?

విషపూరితమైన మొక్క

Advertisement

ChatGPT తినదగినదిగా చెప్పిన మొక్క నిజానికి పాయిజన్ హీమ్లాక్ అనే అత్యంత విషపూరిత మొక్కగా గుర్తించారు. ఈ మొక్క క్యారెట్, కొత్తిమీర వంటి ఆకుకూరలతో పోలి ఉండటంతో చాలామంది పొరపాటున తినే ప్రమాదం ఉంది. కానీ ఈ మొక్కలోని విష పదార్థాలు నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీన్ని తింటే వాంతులు, కండరాల బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన పరిస్థితుల్లో మరణం కూడా సంభవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also read: Green peas Pulao: ఈ సీజన్లో దొరికే గ్రీన్ పీస్‌తో టేస్టీ పులావ్ రెసిపీ ఇదిగో

ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఆ మహిళ ఆ మొక్క ఆకులను తినలేదు. అయితే ChatGPT ఇచ్చిన తప్పు సలహా ఆమె పాటించి ఉంటే పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, ఆహారం, మొక్కలు వంటి కీలక విషయాల్లో AI చెప్పిన మాటలపై మాత్రమే ఆధారపడకూడదని సూచిస్తున్నారు. ChatGPT వంటి టూల్స్ సహాయక సాధనాలే కానీ పూర్తిగా నమ్మదగినవి కాదని చెప్పారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×