IND VS AUS: వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025) తుది దశకు వచ్చింది. నిన్న మొదటి సెమీ ఫైనల్ పూర్తికాగా ఇవాళ రెండో సెమీ ఫైనల్ జరగనుంది. వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ రెండో సెమీ ఫైనల్ లో భాగంగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia Women vs India Women, 2nd Semi-Final) తలపడనున్నాయి. నవీ ముంబై ( Navi Mumbai ) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే, రిజర్వ్ డే కచ్చితంగా ఉంటుంది. సెమీస్ కాబట్టి రిజర్వ్ డే రోజున మ్యాచ్ ఎక్కడైతే ఆగిందో, అక్కడి నుంచే మొదలు అవుతుంది. అయితే, రిజర్వ్ రోజున కూడా వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే, మాత్రం ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరే ప్రమాదం పొంచి ఉంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది కనుక వాళ్లకే ఛాన్స్ లు ఉంటాయి. అప్పుడు ఫైనల్స్ లో దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైట్ ఉంటుంది. దీంతో వర్షం పడకూడదని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. నవీ ముంబై లోని డివై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అంటే టాస్ ప్రక్రియ రెండున్నర గంటలకు ఉంటుంది. ఈ మ్యాచ్ ఇవాళ జరగనున్న నేపథ్యంలో వర్షం విలన్ గా మారే ప్రమాదం పొంచి ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే, సెమీస్ కాబట్టి రిజర్వ్ డే ఉంటుంది. అయితే ఆ రోజున కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే, మాత్రం ఆస్ట్రేలియా ఫైనల్ కు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే పోరాడి ఓడిపోతే పర్వాలేదు కానీ, ఇలా వర్షం పడి ఆస్ట్రేలియా ఫైనల్ కు వెళ్తే కచ్చితంగా అందరూ బాధపడతారు. దీంతో ఇవాళ వర్షం పడకూడదని కోరుకుంటున్నారు మనోళ్లు. అటు ఇటు టోర్నమెంట్ లో ఇప్పటికే వర్షం పడి దాదాపు అరడజన్ కు పైగా మ్యాచ్ లు రద్దు అయ్యాయి. ఆ అంశం కూడా టీమ్ ఇండియాను వణికిస్తోంది. కాగా ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ హాట్ స్టార్ వేదికగా ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా తిలకించవచ్చు.
ఇండియా ప్రాబబుల్ XI: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్/అమంజోత్ కౌర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (c), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ ( wk), స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్
ఆస్ట్రేలియా ప్రాబబుల్ XI: అలిస్సా హీలీ (c/wk), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినక్స్, కిమ్ గార్త్, అలనా కింగ్, మేగాన్ షట్