OTT Movie : మలయాళం థ్రిల్లర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి మరో సినిమా రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రెండు రోజుల్లో నడిచే ఈ కథలో ఊహించని ట్విస్ట్లు వస్తాయి. ఒక ఫ్యామిలీ మ్యాన్ హత్యతో మొదలయ్యే ఈ సినిమా మైండ్ కి పదును పెడుతుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
“థగ్ సిఆర్ 143/24” (Thug CR 143/24) అనేది 2025లో విడుదలైన మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. డైరెక్టర్ బాలు ఎస్ నాయర్ డైరెక్షన్‌లో, ధ్యాన్ శ్రీనివాసన్ లీడ్ రోల్‌లో నటించగా, సిద్దీఖ్, వినయా ప్రసాద్, బిందు పానిక్కర్, సాయికుమార్ వంటి వాళ్లు సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమా రన్ టైమ్ 1 గంట 36 నిమిషాలు. 2025 జూన్ 6న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం మనోరమా మాక్స్ ఓటీటీలో ఈ మలయాళం సినిమా అందుబాటులో ఉంది.
ఒక ఫ్యామిలీ మ్యాన్ ని ఎవరో హత్య చేస్తారు. ఈ కేసు సిఆర్ 143/24 అని రిజిస్టర్ అవుతుంది. పోలీసు టీమ్ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారు. మొదట్లో కేసు సింపుల్‌గా కనిపిస్తుంది. ఒకరు సస్పెక్ట్ గా ఉంటాడు, కానీ త్వరలోనే విషయాలు మారిపోతాయి. ప్రతి వ్యక్తి తమ తమ కథలు చెప్తారు. ఒకరు చెప్పే కథ మరొకరి చెప్పినదాన్ని మార్చేస్తుంది. ఎవరు నిజం చెప్తున్నారు? ఎవరు అబద్ధం చెప్తున్నారు? అనే ప్రశ్నలు మొదలవుతాయి. పోలీసుల్ని కూడా ఈ కేసు తికమక పెడుతుంది. డైరెక్టర్ ఈ భాగంలో టెన్షన్‌ను చాలా బాగా బిల్డ్ చేస్తాడు.
Read Also : ఊరికి మిస్టీరియస్ శాపం… స్కిన్ లేకుండా పుట్టే పిల్లలు… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు అస్సలు చూడకూడని హర్రర్ మూవీ
ఇన్వెస్టిగేషన్ ఒక పెద్ద జాలం లాగా మారుతుంది. ప్రతి క్యారెక్టర్ కొత్త ట్విస్ట్ తీసుకువస్తాడు. డబ్బు సమస్యలు ఈ హత్యకి కారణం అనుకుంటారు పోలీసులు. కానీ ఉన్నట్టుండి అక్రమ సంబంధం కూడా వెలుగులోకి వస్తుంది. దీంతో కేసు మరింత కాంప్లికేట్ అవుతుంది. అన్ని కథలు కనెక్ట్ అయ్యాక, రియల్ ట్రూత్ బయటపడుతుంది. చివరికి అతన్ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అక్రమ సంబంధం వల్లే ఈ హత్య జరిగిందా ? అనే విషయాలను, ఈ మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.